RBI Credit Policy: కొత్తగా ఇల్లు కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త..!

9 Apr, 2022 15:55 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సమయంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్బీఐ) కీలకమైన పాలసీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ఇప్పుడు కొత్తగా ఇల్లుకొనాలనుకునే వారికి వరంలా మారింది. కీలకమైన పాలసీ రేట్లపై ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో గృహ రుణాలపై చౌక వడ్డీకి మార్గం సుగుమం చేసింది. 

బ్యాంకులకు ఊరట..!
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC)లో రెపో రేటు, రివర్స్‌ రెపోరేటులను యథాతథంగా ఉంచింది. రెపోరేటులో మార్పు లేకపోవడంతో చాలా బ్యాంకులకు, బ్యాంకు ఖాతాదారులకు ఊరట కల్పించింది. బ్యాంకులకు అందించే రుణాలపై ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచకపోవడంతో ...ఖాతాదారులకు ఆయా బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కోసం ఆర్బీఐ వడ్డీరేట్లపై ఎలాంటి మార్పులు చేయలేదు. 

పొడగింపు..!
ఇక అధిక లోన్-టు-వాల్యూ రేషియోతో వ్యక్తిగత గృహ రుణాల కోసం అనుమతించబడిన తక్కువ రిస్క్ వెయిటేజీని ఆర్బీఐ మార్చి 31, 2023 వరకు పొడిగించింది. మార్చి 31, 2022 వరకు మంజూరైన అన్ని కొత్త హౌసింగ్ లోన్‌ల టు-వాల్యూ (LTV) నిష్పత్తులు ఉంటాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తన ప్రకటనలో తెలిపారు. ఇది వ్యక్తిగత గృహ రుణాలకు అధిక క్రెడిట్ ప్రవాహాన్ని సులభతరం చేస్తుందని ఆయన చెప్పారు. హౌసింగ్ రంగ ప్రాముఖ్యత, దాని గుణకార ప్రభావాలను గుర్తిస్తూ, ఈ మార్గదర్శకాల వర్తింపును మార్చి 31, 2023 వరకు పొడిగించాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది కాగా ప్రస్తుతం ఆయా బ్యాంకులు 6.50శాతం వడ్డీతో గృహ రుణాలను అందిస్తున్నాయి. అక్టోబర్ 2020 ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ ఎల్‌టీవీ 80 శాతం వరకు ఉన్న సందర్భాల్లో ఇటువంటి రుణాలు 35 శాతం రిస్క్-వెయిట్‌ను ఆకర్షిస్తాయి. ఇక ఎల్‌టీవీ 80 శాతం నుంచి 90 శాతం మధ్య ఉన్నట్లయితే 50 శాతం రిస్క్ వేయిటేజ్‌ను తగ్గించనుంది. 

లోన్స్‌ టూ వాల్యూ అంటే..?
ఎల్‌టీవీ(లోన్‌ టూ వాల్యూ) అనేది ఆస్తి విలువకు వ్యతిరేకంగా రుణగ్రహీతకు మంజూరు చేయగల రుణ పరిమాణాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు, రుణగ్రహీత ఆస్తి విలువలో 80 శాతం వరకు రుణం తీసుకోవచ్చని 80 శాతం ఎల్‌టీవీ సూచిస్తుంది. కాబట్టి, ఆస్తి విలువ రూ. 1 కోటి ఉంటే, రూ. 80 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని గృహ కొనుగోలుదారులు వారి స్వంత జేబులో నుండి నిధులు సమకూర్చాలి.

చదవండి: పెరిగిపోతున్న అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య, హైదరాబాద్‌లో ఎన్ని గృహాలు ఉన్నాయంటే!

మరిన్ని వార్తలు