పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకుకు షాక్ ఇచ్చిన ఆర్‌బీఐ

11 Mar, 2022 20:22 IST|Sakshi

ప్రముఖ ప్రైవేట్ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకుకు ఆర్‌బీఐ షాక్ ఇచ్చింది. కొత్తగా ఖాతాదారులను ఆన్ బోర్డింగ్ చేసుకోవడాన్ని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మార్చి 11న పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంకును ఆదేశించింది. పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకుకు చెందిన ఐటీ వ్యవస్థను సమగ్రంగా ఆడిట్ చేయడానికి ఐటీ ఆడిట్ సంస్థను నియమించాలని బ్యాంకును ఆదేశించినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 

"బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 35A కింద ఆర్‌బీఐ తన అధికారాల మేరకు.. పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ని కొత్త వినియోగదారులను ఆన్‌బోర్డింగ్ చేయకుండా తక్షణమే నిలిపివేయాలని ఆదేశించినట్లు" ఆర్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది. బ్యాంకు పర్యవేక్షణ లోపాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఆగస్టు 2016లో ప్రారంభమైంది. నోయిడాలోని ఒక శాఖ నుంచి మే 2017లో అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించింది. పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ వచ్చే జూన్ నాటికి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ఎస్‌ఎఫ్‌బీ) లైసెన్స్‌ కోసం ఆర్‌బీఐకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సమాచారం.

(చదవండి: ఏటీఎం కార్డు లేనివారికి ఎన్‌పీసీఐ గూడ్‌న్యూస్..!)

>
మరిన్ని వార్తలు