క్రిప్టోకరెన్సీలపై పూర్తి నిషేధమే మేలు: ఆర్బీఐ

18 Dec, 2021 20:31 IST|Sakshi

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం క్రిప్టోకరెన్సీలపై నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. డిజిటల్‌ కరెన్సీ, ప్రైవేటు క్రిప్టోకరెన్సీలపై సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరక్టర్ల 592వ సమావేశంలో ఆర్బీఐ పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.   

పూర్తి నిషేధమే మేలు..!
క్రిప్టో క‌రెన్సీల‌పై పూర్తిస్థాయి నిషేధం విధించాల్సిందేన‌ని ఆర్బీఐ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీలపై పాక్షిక ఆంక్ష‌లు ఫలితాలు ఇవ్వబోవని ఆర్బీఐ బ్యాంకు బోర్డు స‌మావేశంలో పేర్కొన్న‌ట్లు స‌మాచారం. క్రిప్టోల‌పై ఆర్బీఐ వైఖ‌రిని సెంట్ర‌ల్ బోర్డు కూడా  స‌మ‌ర్థించిన‌ట్లు తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీలను తీవ్రమైందిగా భావించాలని ఆర్బీఐ గవర్నర్‌ ఈ సమావేశంలో వెల్లడించారు.

క్రిప్టో ఆస్తులను నియంత్రించ‌డం క‌ష్టంతో కూడుకున్న పని అని అభిప్రాయపడింది. ఈ సమావేశంలో కొందరు సభ్యులు బ్యాలెన్స్‌డ్‌ విధానాలను అనుసరించాలని కోరారు. క్రిప్టో వ్యవహారంపై కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు ఎటువంటి వైఖ‌రిని వెల్ల‌డించ‌లేద‌ని తెలుస్తోంది. క్రిప్టో క‌రెన్సీ అండ్ రెగ్యులేష‌న్ ఆఫ్ అఫిషియ‌ల్ డిజిట‌ల్ క‌రెన్సీ-2021 బిల్లుపైనా కూడా  ఆర్బీఐ బోర్డు  చర్చించింది. 

చదవండి:  యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..! అయితే వీటిని కచ్చితంగా గుర్తుంచుకోండి..!

మరిన్ని వార్తలు