మారుతున్న ఆర్థిక పరిస్థితులను గమనించాలి

17 Nov, 2022 02:23 IST|Sakshi

బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్‌ సూచన

ముంబై: మారుతున్న స్థూల ఆర్థిక పరిస్థితులను గమనిస్తూ, సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ బ్యాంకులను కోరారు. అప్పుడే తమ బ్యాలన్స్‌ షీట్లపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావాన్ని పరిమితం చేసుకోవచ్చన్నారు. కరోనా సంభవించినప్పటి నుంచి కల్లోల సమయంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించినట్టు అంగీకరించారు. సవాళ్లు ఉన్నప్పటికీ భారత బ్యాంకింగ్‌ రంగం బలంగా ఉందంటూ, ఎన్నో అంశాల్లో మెరుగుపడుతున్నట్టు చెప్పారు.

ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ఎండీ, సీఈవోలతో గవర్నర్‌ సమీక్ష నిర్వహించారు. డిపాజిట్లలో వృద్ధి నిదానంగా ఉండడం, రుణాల వృద్ధి, ఆస్తుల నాణ్యత, ఐటీ సదుపాయాలపై పెట్టుబడులు, నూతన టెక్నాలజీ సొల్యూషన్లను అందిపుచ్చుకోవడం, డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్ల నిర్వహణ తదితర అంశాలు చర్చకు వచ్చాయి. ఆర్‌బీఐ డేటా ప్రకారం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో బ్యాంకుల డిపాజిట్లలో 9.6 శాతం వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 10.2 శాతంతో పోలిస్తే తగ్గింది. కానీ, ఇదే కాలంలో రుణాల్లో వృద్ధి 6.5 శాతం నుంచి 17.9 శాతానికి పెరగడం గమనార్హం.

మరిన్ని వార్తలు