కస్టమర్ల నుంచి అదే పనిగా ఫిర్యాదులు: ఆర్బీఐ గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు!

29 Oct, 2022 08:29 IST|Sakshi

ఫిర్యాదులకు అంబుడ్స్‌మెన్‌ పరిష్కారం చూపాలి

జోధ్‌పూర్‌: కస్టమర్ల నుంచి అదే పనిగా ఫిర్యాదులు వస్తున్నందున దీనికి మూల కారణాలను నియంత్రణ సంస్థలు, అంబుడ్స్‌మెన్‌ గుర్తించి, అందుకు వ్యవస్థాపరమైన పరిష్కారం చూపాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ అంబుడ్స్‌మెన్‌ వార్షిక సమావేశం జోధ్‌పూర్‌లో జరిగింది. దీనిని ఉద్దేశించి శక్తికాంతదాస్‌ మాట్లాడారు. కస్టమర్ల ఫిర్యాదులకు వేగవంతమైన, పారదర్శకమైన పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

‘‘ఫైనాన్షియల్‌ వ్యవస్థ ముఖచిత్రం మారుతోంది. కానీ, అంతర్గత సూత్రాలైన కస్టమర్లకు మెరుగైన సేవలు, కస్టమర్లకు రక్షణ, పారదర్శకత, సరైన ధర, నిజాయితీ వ్యవహారాలు, బాధ్యాయుతమైన వ్యాపార నడవడిక, కన్జ్యూమర్‌ డేటా, గోప్యత పరిరక్షణ అన్నవి ఎప్పటికీ నిలిచి ఉంటాయి. వీటికితోడు మనమంతా కలసి కస్టమర్లకు వైవిధ్యాన్ని చూపాలి’’అని చెప్పారు. కస్టమర్ల అనుభవాన్ని మరింత మెరుగు పరిచేందుకు అంబుడ్స్‌మెన్‌ తగినన్ని మార్పులు తీసుకురాగలదన్నారు.

చదవండి: Elon Musk: ఎలాన్ మస్క్‌కు షాక్‌.. ట్విట్టర్‌లో యాడ్స్ బంద్‌!

మరిన్ని వార్తలు