హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ ఒకే - పరిమితుల పెంపునకు అనుమతి

7 Feb, 2024 08:00 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజాలు ఐసీఐసీఐ, యాక్సిస్‌ మొదలైన 6 సంస్థల్లో అధిక వాటాల కొనుగోలుకి ఆర్‌బీఐ అనుమతించినట్లు ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తాజాగా వెల్లడించింది. వీటితో పాటు సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, బంధన్‌ బ్యాంక్, యస్‌ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లలో గ్రూప్‌ స్థాయిలో 9.5 శాతం వాటా వరకూ సొంతం చేసుకోవడానికి వీలవుతుందని పేర్కొంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గ్రూప్‌ కింద హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ తదితర సంస్థలున్నాయి. పెట్టుబడి పరిమితుల పెంపు కోసం వీటి తరఫున ప్రమోటర్‌/గ్రూప్‌ స్పాన్సర్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2023 డిసెంబర్‌ 18న ఆర్‌బీఐకు దరఖాస్తు చేయగా.. ఈ నెల(ఫిబ్రవరి) 5న ఆర్‌బీఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచి్చంది. 

వెరసి 2025 ఫిబ్రవరి 4వరకూ అంటే ఏడాదిపాటు ఆర్‌బీఐ అనుమతులు అమలుకానున్నాయి. ఆయా బ్యాంకుల్లో మరింత ఇన్వెస్ట్‌ చేసే యోచనేమీ లేనప్పటికీ, వాటిల్లో తమ గ్రూపు సంస్థల మొత్తం వాటాలు నిర్దేశిత 5 శాతం పరిమితిని దాటే అవకాశం ఉండటంతోనే పెట్టుబడి పరిమితిని పెంచాలని ఆర్‌బీఐని కోరినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega