పేమెంట్‌ అగ్రిగేటర్‌గా హిటాచీ: ఆర్‌బీఐ గ్రీన్‌ సిగ్నల్‌

10 Jan, 2023 16:14 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ పేమెంట్‌ సేవల్లోకి మరో సంస్థ వచ్చి చేరింది.  హిటాచీ చెల్లింపు సేవలకు ఆర్‌బీఐ తాజాగా పేమెంట్‌ అగ్రిగేటర్ లైసెన్స్‌ను మంజూరు చేసింది. దీంతో B2B కస్టమర్‌లకు EMI, పేలేటర్, BBPS , లాయల్టీ సొల్యూషన్స్‌ లాంటి వాల్యూ యాడెడ్ సర్వీస్‌లతో పాటు అన్ని డిజిటల్ చెల్లింపులకు సూత్రప్రాయంగా ఆమోదాన్ని తెలిపిందని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ఆథరైజేషన్ ద్వారా కస్టమర్లకు వన్ స్టాప్ డిజిటల్ పేమెంట్ సేవలను కూడా  అందించనున్నామనివెల్లడించింది.  

ఆర్‌బీఐ తమకందించిన పేమెంట్ అగ్రిగేటర్ ఆథరైజేషన్‌ ద్వారా దేశంలో పటిష్టమైన డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే  తమ దృష్టి మరింత బలోపేతం కానుందని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ రుస్తోమ్ ఇరానీ అన్నారు. తద్వారా దేశ ప్రజలకు సులభమైన డిజిటల్ చెల్లింపులను అందించడంతోపాటు, డిజిటల్ ఇండియా చొరవకు మరింత దోహదపడుతుందనీ, అందరికీ ఆర్థిక సాధికారతను అందిస్తుందని ఇరానీ చెప్పారు.

మరిన్ని వార్తలు