ఈ-కామర్స్‌కు ఆర్బీఐ పెద్దపీట! ఆన్‌లైన్‌ చెల్లింపులపై కీలక నిర్ణయం!

8 Apr, 2022 08:19 IST|Sakshi

ముంబై: ఎగుమతులు–దిగుమతులు (ఎగ్జిమ్‌), ఇందుకు సంబంధించి చెల్లింపుల పరిష్కార ప్రక్రియలో ఈ–కామర్స్‌కు పెద్దపీట వేయడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దృష్టి సారిస్తోంది. ఈ దిశలో ఆయా అంశాలను సరళీకరించి, హేతుబద్ధీకరించడంపై కీలక చర్య తీసుకుంది. ఇందుకు వీలుగా  ప్రస్తుత నిబంధనలను సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక ముసాయిదా మార్గదర్శకాల పత్రాన్ని సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రతిపాదించింది. 

‘‘ఎగుమతి, దిగుమతులకు సంబంధించి చిన్న స్థాయి చెల్లింపుల ప్రక్రియను ఈ కామర్స్‌ ద్వారా సులభతరం చేయడానికి తీసుకువస్తున్న ఆన్‌లైన్‌ ఎక్స్‌పోర్ట్‌–ఇంపోర్ట్‌ ఫెసిలిటేటర్స్‌’ అనే శీర్షికన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. బ్యాంకులు, ఇతర సంబంధిత వర్గాల నుంచి స్వీకరించిన అభిప్రాయాల ప్రాతిపదిక, సమగ్ర సమీక్ష అనంతరం తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆర్‌బీఐ ప్రకటన సూచించింది.   

పరిమితులు ఇలా... 
3,000 డాలర్లకు మించని విలువైన వస్తువులు, డిజిటల్‌ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో దిగుమతి చేసుకోవడానికి ఈ కామర్స్‌ చెల్లింపుల సౌకర్యం అందుబాటులో ఉంటుందని సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రతిపాదించింది. ఎగుమతుల విషయంలో ఈ విలువ 15,000 డాలర్ల వరకూ ఉంది. 

ప్రస్తుతం వస్తువులు, సేవల ఎగుమతులు, అలాగే వస్తువులు, సాఫ్ట్‌వేర్‌ల దిగుమతికి సంబంధించి చెల్లింపు ప్ర క్రియ నిర్వహించడానికి బ్యాంకింగ్‌కు అనుమతి ఉంది. దీనిప్రకారం ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వే సర్వీ స్‌ ప్రొవైడర్‌లతో (ఓపీజీఎస్‌పీలు) స్టాండింగ్‌ కాంట్రాక్ట్‌లోకి ప్రవేశించడం ద్వారా దిగుమతి,  ఎగు మతి సంబంధిత రెమిటెన్స్‌ల ప్రాసెసింగ్, సెటిల్మెంట్‌ సౌకర్యాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి.

మరిన్ని వార్తలు