నాలుగు బ్యాంకులపై జరిమానా విధించిన ఆర్‌బీఐ

21 May, 2021 17:37 IST|Sakshi

ముంబై: సెంట్రల్ బ్యాంక్ ఆర్‌బీఐ జారీ చేసిన కొన్ని ఆదేశాలను ఉల్లంఘించినందుకు సిటీ యూనియన్ బ్యాంక్, తమిళనాడు మెర్కాంటైల్ బ్యాంక్, మరో  రెండు ఇతర బ్యాంకులపై ఆర్‌బీఐ భారీ జరిమానా విధించింది. వ్యవసాయ రుణాలు, ఎడ్యుకేషన్ రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాల విషయంలో ఆర్‌బీఐ నిబంధనలను పాటించని కారణంగా సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్‌కు రూ.1 కోటి జరిమానా విధించింది. అలాగే, సైబర్ సెక్యూరిటీ విషయంలో నిబందనలు పాటించని కారణంగా తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ పై రూ.1 కోటి జరిమానా వేసింది.

ఆర్‌బీఐ ఇంకా మరో రెండు బ్యాంకులపై కూడా జరిమానా విధించింది. డిపాజిట్లపై వడ్డీ రేట్లు, కేవైసీ రూల్స్‌ను నూతన్ నాగరిక్ సహకారి బ్యాంక్‌ బ్యాంక్ అతిక్రమించినందుకు రూ.90 లక్షల జరిమానా విధించింది. 'రిజర్వ్ బ్యాంక్ కమర్షియల్ పేపర్ డైరెక్షన్స్ 2017', 'నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్'లో ఉన్న కొన్ని నిబంధనలను పాటించనందుకు పూణేలోని డైమ్లెర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పై అపెక్స్ బ్యాంక్ పై రూ.10 లక్షల జరిమానా వేసింది.

చదవండి:

18 మిలియన్ల పోస్టులను తొలగించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్

మరిన్ని వార్తలు