నిబంధనలు పాటించని కెనరా బ్యాంకు: ఆర్బీఐ భారీ పెనాల్టీ

13 May, 2023 18:29 IST|Sakshi

సాక్షి, ముంబై: రిజర్వు బ్యాంక్ ఆఫ్‌ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకు కెనరా బ్యాంకునకు భారీ షాక్‌ ఇచ్చింది. రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించిందని ఆగ్రహించిన ఆర్బీఐ భారీ పెనాల్టీ విధించింది. ప్రధానంగా రిటైల్ రుణాలపై ఫ్లోటింగ్ రేట్ వడ్డీని, ఎంఎస్‌ఎంఈ రుణాలను బాహ్య బెంచ్‌మార్క్‌తో లింక్ చేయడంలో బ్యాంక్ విఫలమైందని పేర్కొంది.  (మైనర్ల పేరుతో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు: నిబంధనలు మారాయి)

వడ్డీ రేట్లను బాహ్య బెంచ్‌మార్క్‌తో అనుసంధానం చేయడం, అనర్హులకు పొదుపు ఖాతాలు తెరవడం వంటి పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు కెనరా బ్యాంక్‌పై రూ.2.92 కోట్ల జరిమానా విధించింది. ఆర్బీఐ చేపట్టిన తనిఖీల్లో విషయాలు వెలుగులోకి రావటంతో  ఈ పరిణామం చోటు చేసుకుంది.  బ్యాంక్ ఫ్లోటింగ్ రేట్ రిటైల్ రుణాలపై వడ్డీని, ఎంఎస్‌ఎంఈలకి ఇచ్చే రుణాలను బాహ్య బెంచ్‌మార్క్‌తో లింక్ చేయడంలో విఫలమైందని గుర్తించినట్టు కేంద్ర బ్యాంకు ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన,ఫ్లోటింగ్ రేటు రూపాయి రుణాలపై వడ్డీని దాని మార్జినల్ కాస్ట్‌తో లింక్ చేయడంలో విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది.

ఇదీ చదవండి: 18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్‌మెంట్‌

అలాగే  పలు క్రెడిట్ కార్డ్ ఖాతాలలో నకిలీ మొబైల్ నంబర్‌లను నమోదు చేయటం, 24 నెలలలోపు ముందుగానే ఉపసంహరించుకోవడం, కస్టమర్ల నుండి ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ చార్జీలను వసూలు చేసిందనితెలిపింది. కస్టమర్ ప్రొఫైల్‌కు విరుద్ధంగా లావాదేవీలు జరిగినప్పుడు అలర్ట్‌లను రూపొందించడానికి కొనసాగుతున్న కస్టమర్ డ్యూ డిలిజెన్స్‌ను చేపట్టడంలో విఫలమైందని పేర్కొంది. రోజువారీ డిపాజిట్ పథకం కింద ఆమోదించిన డిపాజిట్లపై వడ్డీని చెల్లించడంలో కూడా విఫలమైందని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.

మరిన్ని వార్తలు