డిజిటల్‌ కరెన్సీ:సీబీడీసీపై ఆర్బీఐ కీలక ప్రకటన

29 Nov, 2022 18:16 IST|Sakshi

సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిజిటల్ కరెన్సీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది.  డిజిటల్‌ రుపీ  వెర్షన్ డిసెంబర్ 1 న లాంచ్‌ చేస్తున్నట్టు మంగళవారం(నవంబర్ 29) ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ సీబీడీసీపైలట్ ప్రాజెక్ట్‌ను నవంబర్ 1న ప్రారంభించిన సంగతి తెలిసిందే. (ఫోర్బ్స్‌ టాప్‌ -10 లిస్ట్‌: బిలియనీర్లు అదానీ, అంబానీ ఎక్కడ?)

క్లోజ్డ్ యూజర్ గ్రూప్‌ వినియోగదారులు భాగస్వామ్య బ్యాంకులు అందించే డిజిటల్ వాలెట్ ద్వారా ఇ-రూపాయితో లావాదేవీలు చేసుకోవచ్చని, మొబైల్ ఫోన్‌లు లేదా పరికరాలలో నిల్వ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. దీంతో రీటైల్ సెగ్మెంట్‌లో సాధారణ వ్యాపారులకు, కస్టమర్లకు డిజిటల్ రుపీ అందుబాటులోకి రానుంది. (నైకా ఫల్గుణి సంచలనం: తగ్గేదేలే అంటున్న బిజినెస్‌ విమెన్‌)

 కొన్ని ముఖ్యాంశాలు
రిటైల్ డిజిటల్  ప్రస్తుతం చలామణిలోఉన్న  2 వేలు, 500, 200 రూపాయలు తదితర  కరెన్సీ నోట్లు,  నాణేలలాగానే అదే డినామినేషన్లలో అందుబాటులో ఉంటుంది. 
వ్యక్తి నుండి వ్యక్తికి ( పీటూపీ) లావాదేవీలు అలాగే వ్యక్తి నుండి వ్యాపారి (పీటూ మర్చంట్‌) లావాదేవీలు చేసుకోవచ్చు. 
అన్ని క్యూఆర్‌ కోడ్‌లను ఉపయోగించి  చెల్లింపులు చేయవచ్చు
భౌతిక నగదు విషయంలో మాదిరిగానే రిటైల్ డిజిటల్ రూపాయిలో సెటిల్‌మెంట్‌  ట్రస్ట్‌, సేఫ్టీ హామీ ఇస్తుంది.
♦ వాలెట్లలో నిల్వ ఉంచిన డిజిటల్ కరెన్సీకి ఎటువంటి వడ్డీ రాదు
అయితే రిటైల్ డిజిటల్ రూపాయిని వడ్డీని సంపాదించే బ్యాంకుల్లో డిపాజిట్‌లుగా మార్చుకోవచ్చు .
తొలిదశగా దేశంలోని నాలుగు నగరాల్లో ఎస్బీఐ, సీఐసీ బ్యాంక్, యస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ ద్వారా తొలి దశలో లావాదేవీలను ప్రారంభించనుంది.
రెండో దశలో మరిన్ని నగరాల్లో బీవోబీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ , కోటక్ మహీంద్రా బ్యాంక్ తదుపరి దశలో  పైలట్‌లో చేరనున్నాయి. 
♦ ప్రారంభంలో ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ అనే నాలుగు నగరాల్లో  డిజిల్‌ రూపాయి లావాదేవీలు ప్రారంభం. క్రమంగా అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా సిమ్లాలకు  అమల్లోకి వస్తుంది.  క్రమంగా మరిన్ని బ్యాంకులు, నగరాలు ఈ జాబితాలో చేరతాయి. 

కాగా నవంబర్ 1 నుంచే ఆర్బీఐ హోల్‌సేల్ ఇ-రూపాయిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది, ఎనిమిది బ్యాంకులు ఇ-రూపాయిని ఉపయోగించి ప్రభుత్వ సెక్యూరిటీలలో లావాదేవీలు జరుపు తున్నాయి. దీని ఆధారంగా ఇ-రూపాయి ఇతర ఫీచర్లు ,అప్లికేషన్లను తర్వాత టెస్ట్‌ చేయనుంది.  పైలట్‌ ప్రాజెక్ట్‌ అమలుపై సమీక్ష తరువాత మరిన్ని బ్యాంకులు, వినియోగదారులు పరిధిని క్రమంగా విస్తరిస్తామని గతంలో ఆర్బీఐను ప్రకటించింది.

ఇదీ చదవండి :  షాకింగ్‌: 5.4 మిలియన్ల ట్విటర్‌ యూజర్ల డేటా లీక్! మస్క్‌ స్పందన ఏంటి?

మరిన్ని వార్తలు