Feature Phone Users: ఫీచర్‌ ఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..!

9 Dec, 2021 01:11 IST|Sakshi

కోట్లాదిమంది ఫీచర్‌ ఫోన్‌ హోల్డర్లు కూడా ఇకపై యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) పేమెంట్లు జరిపేలా చర్యలకు కూడా శ్రీకారం చుడుతున్నట్లు గవర్నర్‌ శక్తికాంతదాస్‌ సూచించారు. ట్రాయ్‌ సమాచారం ప్రకారం, అక్టోబర్‌ 2021 నాటికి భారతదేశంలో దాదాపు 118 కోట్ల మంది మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులు ఉన్నారు. ఇందులో గణనీయమైన సంఖ్యలో వినియోగదారులు ఇప్పటికీ ఫీచర్‌ ఫోన్‌లలోనే ఉన్నారు.  జూలై 2021 నాటికి దాదాపు 74 కోట్ల మంది వినియోగదారులు స్మార్ట్‌ ఫోన్‌లను కలిగి ఉన్నట్లు అంచనా. స్మార్ట్‌ఫోన్లలో యూపీఐ పేమెంట్లు ఇప్పటికే భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.  

డిజిటల్‌ పేమెంట్లు మరింత భారీగా పెరగాలని ఆర్‌బీఐ భావిస్తోంది. ఈ దిశలో డిజిటల్‌ పేమెంట్లకు సంబంధించి కస్టమర్లపై విధిస్తున్న చార్జీలను సమీక్షించాలని నిర్ణయించింది. తగిన చౌకగా ఈ చెల్లింపుల లావాదేవీలు ఉండేలా తీసుకునే చర్యల్లో భాగంగా దీనిపై ఒక చర్చాపత్రం విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఐపీఓకు ప్రధాన పేమెంట్‌ ఆప్షన్‌గా యూపీఐ మారిందని తెలిపింది. యూపీఐ వ్యవస్థ ద్వారా లావాదేవీ పరిమాణం 2020 మార్చి నుంచి రూ.లక్ష నుంచిరూ.2 లక్షలకు పెరిగింది. 

>
మరిన్ని వార్తలు