RBI Rate Hike: ఆర్బీఐ షాక్‌తో ఇక ఈఎంఐలు భారమే!

5 Aug, 2022 11:38 IST|Sakshi

సాక్షి,ముంబై: కేంద్ర బ్యాంకు ఆర్బీఐ తాజా నిర్ణయంతో సామాన్యుడికి భారీ షాక్‌ ఇచ్చింది. గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన  ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో  50 బీపీఎస్‌ పాయింట్లు  మేర రెపోరేటును నిర్ణయాన్ని ఏకగగ్రీవంగా తీసుకున్నారు. దీంతో  రెపో రేటు 5.40 శాతాని చేరింది. ఫలితంగా గృహ, వాహనాల రుణాలపై  వినియోగదారులకు ఈఎంఐ భారం పడనుంది.

రెపో రేట్ పెరిగితే బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే రుణాల వడ్డీ రేట్లు పెంచకుండా ఉండవు. దీంతో కస్టమర్లకు ఈఎంఐ భారం అవుతుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఇతర రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారికీ ఎక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది. ముఖ్యంగా రెపో రేట్‌కు అనుసంధానమైన హోమ్ లోన్లు తీసుకున్న వారికి తాజా సవరణతో  సమస్య తప్పదు. దాదాపు 40 శాతం రుణాల రేట్లు ఇలానే ఉంటాయి. అలాగే ఆ ప్రభావం రియల్ ఎస్టేట్  రంగంపై ప్రతికూలంగా ఉండనుంది. 

(చదవండి: Adani Road Transport: అదానీ హవా, 3 వేల కోట్ల భారీ డీల్‌

హోం లోన్‌ తీసుకున్నవారికి మరో భారీ షాక్‌ తప్పదా? ఏం చేయాలి?


 

మరిన్ని వార్తలు