ఆర్‌బీఐ కీలక సమావేశాలు ప్రారంభం

3 Dec, 2020 05:40 IST|Sakshi

శుక్రవారం విధాన నిర్ణయాల ప్రకటన

వడ్డీరేట్ల యథాతథ పరిస్థితి!

క్షీణ రేటు అంచనా సవరించే అవకాశం

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల కీలక సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఈ సమావేశం విధాన నిర్ణయాలు వెల్లడవుతాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం అదుపులోనికిరాని పరిస్థితుల్లో  బ్యాంకులకు తానిచ్చే రుణాలపై  వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) మరింత తగ్గించే అవకాశాలు లేనట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. ‡  ఇక 2020–21 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణ రేటు అంచనాలను ఎంపీసీ  తగ్గించే అవకాశం ఉంది.  అలాగే వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మరింత మెరుగుపడ్డానికి తగిన చర్యలనూ ప్రకటించవచ్చని అంచనా. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు