ద్రవ్యోల్బణ కట్టడి బాధ్యతను ఆర్‌బీఐకే వదిలేయలేం..!

9 Sep, 2022 06:38 IST|Sakshi

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం నియంత్రణ బాధ్యతలను కేవలం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య  విధానానికే వదిలివేయలేమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ప్రకారం, కేవలం ద్రవ్య పరమైన అంశాలే కాకుండా ద్రవ్యోల్బణాన్ని పలు అంశాలు నిర్దేశిస్తున్నాయని సూచించారు.

ప్రముఖ ఆర్థిక విశ్లేషణా సంస్థ ఇక్రియర్‌ నిర్వహించిన సెమినార్‌లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ,  కేవలం ద్రవ్య విధానంతోనే ద్రవ్యోల్బణ నియంత్రణ సాధ్యమన్న అభిప్రాయం పలు దేశాల్లో విఫలమైందని పేర్కొన్నారు. దీనిపై ఆర్‌బీఐ కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆమె, అయితే ఈ విషయంలో తాను ఆర్‌బీఐకి ఎటువంటి నిర్దేశించడంలేదని కూడా స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం నియంత్రణ విషయంలో కేంద్రం–రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం అని కూడా ఆర్థికమంత్రి     పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు