డెబిట్, క్రెడిట్ కార్డులపై ఆంక్షలు

30 Sep, 2020 15:04 IST|Sakshi

సాక్షి, ముంబై:  బ్యాంకు కార్డు మోసాలకు చెక్ పెడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కొత్త గైడ్ లైన్స్ అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డులకు మరింత రక్షణ కల్పించేలా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని ఆర్‌బీఐ  వెల్లడించింది. తక్షణమే అన్ని బ్యాంకులు, కార్డులను జారీ చేసే కంపెనీలు డెబిట్, క్రెడిట్ కార్డుల అనవసరంగా అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపు సేవలను తీసివేయాలని, కార్డు వినియోగదారుడు అభీష్టం మేరకు  ఆ సౌకర్యాన్ని కల్పించాలని ఆర్‌బీఐ  కొత్త మార్గ దర్శకాలను జారీ చేసింది.. 

క్రెడిట్ కార్డులను ఇంటర్నేషనల్, ఆన్ లైన్ లావాదేవీలకు, కాంటాక్ట్ లెస్ కార్డ్ లావాదేవీలకు వాడాలంటే, ముందస్తు అనుమతి తప్పనిసరి. వాడకంపై ముందుగానే పరిమితులను పెట్టుకోవచ్చు. ఈ పరిమితి దాటి కార్డు ద్వారా లావాదేవీకి ప్రయత్నిస్తే, వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్ ఫోన్ కు సమాచారం అందుతుంది. కస్టమర్లు తమ కార్డులను ఏటీఎం, ఎన్ఎఫ్సీ, పీఓఎస్, ఈ-కామర్స్ లావాదేవీలకు వాడకుండా తాత్కాలికంగానూ నిషేధించుకోవచ్చు. బ్యాంకులు జారీచేసే క్రెడిట్, డెబిట్ కార్డులుఏటీఎంలలోనూ, పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) వద్ద మాత్రమే పనిచేస్తాయి. కస్టమర్లకు వారి నుంచి అనుమతి తీసుకున్న తరువాతనే ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కు ఖాతాను జత చేస్తారు.  ఈ నిబంధన ప్రీ పెయిడ్, గిఫ్ట్ కార్డులకు మాత్రం వర్తించదు.

ఎలా అంటే 

  • మొబైల్ లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారా మీ బ్యాంక్ ఖాతాకు లాగిన్ అవ్వాలి.
  • కార్డులు విభాగంలోకి వెళ్లి ' మేనేజ్ కార్డ్స్ ' ఎంచుకోవాలి.
  • డొమెస్టిక్, ఇంటర్నేషనల్  అనే ఆప్షన్లు కనిపిస్తాయి.    
  • ఇక్కడ మనకు కావాల్సిన దాన్ని ఎంచుకుని డిసేబుల్ చేయాలి.  
  • మళ్లీ కావాలనుకున్నపుడు దానికనుగుణంగా ఆన్ - ఆఫ్  చేసుకోవచ్చు.
  • అలాగే ట్రాన్సాక్షన్ పరిమితిని  కూడా సెట్ చేసుకోవచ్చు.
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా