గోల్డ్‌ లోన్‌ కంపెనీలకు ఆర్‌బీఐ ఝలక్‌

20 Nov, 2020 14:05 IST|Sakshi

ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం ఫైనాన్స్‌ కంపెనీలకు ఆర్‌బీఐ జరిమానా

ముత్తూట్ ఫైనానన్స్‌కు.10 లక్షలు

మనప్పురం ఫైనాన్స్‌లకు  రూ .5 లక్షలు జరిమానా

సాక్షి, ముంబై: గోల్డ్‌ లోన్‌ కంపెనీలు మణప్పురమ్ ఫైనాన్స్‌, ముత్తూట్ ఫైనాన్స్‌కు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఝలక్ ఇచ్చింది. నిర్దేశిత నిబంధనలను అతిక్రమించారంటూ ఇరు కంపెనీలకు భారీ జరిమానా విధించింది. ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం ఫైనాన్స్‌లకు వరుసగా రూ .10 లక్షలు, రూ .5 లక్షలు జరిమానా విధించినట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

ర్నాకులంలోని ముత్తూట్ ఫైనాన్స్‌ విభాగం మార్చి 31, 2018 మరియు మార్చి 31, 2019 కాలంలో గోల్డ్ లోన్లకు సంబంధించి లోన్ టు వ్యాల్యూ రేషియో మార్గదర్శకాలను ముత్తూట్ ఫైనాన్స్ అనుసరించలేదని రిజర్వు బ్యాంక్ పేర్కొంది.  నిబంధనలను అతిక్రమించిన కారణంగా  రూ.10 లక్షల జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా సంస్థ రూ.5 లక్షలకు పైన బంగారు రుణాలు జారీ చేసేటప్పుడు రుణ గ్రహీతల నుంచి పాన్ కార్డు తీసుకోవడమనే రూల్స్‌ను అనుసరించలేదని, అందుకే ఫైన్ వేశామని వివరణ ఇచ్చింది. దీంతోపాటు గోల్డ్ జువెలరీ ఓనర్‌షిప్ వెరిఫికేషన్‌ రూల్స్‌ను అనుసరించకపోవడంతో త్రిసూర్‌లోని మణపురం ఫైనాన్స్‌పై ఆర్‌బీఐ చర్య తీసుకుంది. రూ.5 లక్షల జరిమానా విధించింది. 2019 మార్చి 31 నాటికి సంస్థ ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తే, ఆర్‌బీఐ ఆదేశాలను పాటించలేదని తేలిందని చెప్పింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా