మార్కెట్‌కు ఆర్‌బీఐ బూస్ట్‌ : బ్యాంకింగ్ ‌షేర్లు దౌడు

7 Apr, 2021 11:15 IST|Sakshi

ఆర్‌బీఐ పాలసీ నిర్ణయంతో ఉత్సాహం

  49వేల ఎగువకు సెన్సెక్స్‌

14800 దాటేసిన నిఫ్టీ

సాక్షి, ముంబై: ఆర్‌బీఐ నిర్ణయం స్టాక్‌మార్కెట్‌కు‌ మాంచి బూస్ట్‌లా పనిచేసింది. ఆరంభంనుంచి ఉత్సాహంగానే ఉన్న కీలక సూచీలు ఆ తరువాత మరింత జోష్‌గా కొనసాగు తున్నాయి. అంచనాలకు అనుగుణంగానే వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ విధాన  నిర్ణయాన్ని వెలువరించిన వెంటనే బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల ధోరణి నెలకొంది.  దీంతో సెన్సెక్స్‌ 600 పాయింట్లు ఎగిసి 49800 వద్ద, నిఫ్టీ 179 పాయింట్ల లాభంతో 14862 వద్ద కొనసాగుతున్నాయి. ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐవోబీ, కెనరా, యూనియన్‌ లాంటి ప్రభుత్వరంగ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. అటు రియల్టీ, ఆటో రంగ షేర్లు కూడా ఉత్సాహంగా కొన సాగుతున్నాయి.డీఎల్ఎఫ్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, శోభా, సుంటెక్ రియాల్టీ,  ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, అశోక్ లేలాండ్, బాష్, మదర్సన్ సుమీ సిస్టమ్స్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ లాభపడుతున్నాయి.  (RBI Monetary Policy: కరోనా ఉధృతి: ఆర్‌‌బీఐ కీలక నిర్ణయం)

కాగా ఆర్‌బీఐ పాలసీ రివ్యు తాజా నిర్ణయంతో రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్‌ రెపో రేటు 3.5 శాతం వద్ద కొనసాగనున్నాయి. కోవిడ్-19 తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో పరిస్థితులకు అనుగుణంగా  తగిన  నిర్ణయం తీసుకుంటుందన్న గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటిన ఇన్వెస్టర్లుకు భరోసానిచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు