డిజిటల్‌ చెల్లింపుల్లో 29 శాతం వృద్ధి

28 Jul, 2022 08:48 IST|Sakshi

ముంబై: దేశ వాసులు డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా రాకతో కరెన్సీ నోట్ల వినియోగం తగ్గడం, అదే సమయంలో సౌకర్యవంతమైన డిజిటల్‌ చెల్లింపుల సాధనాలు (యూపీఐ ఆధారిత) అందుబాటులోకి రావడం ఇందుకు అనుకూలిస్తోంది. డిజిటల్‌ చెల్లింపులు గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2021–22) 29 శాతం వృద్ధి చెందినట్టు ఆర్‌బీఐ డేటా తెలియజేస్తోంది.

ఆర్‌బీఐ కొత్తగా రూపొందించిన డిజిటల్‌ పేమెంట్‌ ఇండెక్స్‌ (ఆర్‌బీఐ–డీపీఐ) 2022 మార్చి చివరికి 349.3గా ఉంది. 2021 సెప్టెంబర్‌కు ఇది 304.06, 2021 మార్చి నాటికి 270.59గా ఉండడం గమనార్హం. డిజిటల్‌ చెల్లింపులకు ఆమోదం ఎంతో వేగంగా  ఉందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని ఆర్‌బీఐ పేర్కొంది.

చదవండి: Realme Pad X Tablet: రియల్‌మీ కొత్త టాబ్లెట్‌.. తక్కువ ధర, 5జీ కనెక్టివిటీ..

మరిన్ని వార్తలు