రూల్స్‌ ఉల్లంఘన.. పిఎన్‌బి, ఐసీఐసీఐకు భారీ పెనాల్టీ!

15 Dec, 2021 20:37 IST|Sakshi

భారతీయ బ్యాంకులకు పెద్దన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్‌బి), ఐసీఐసీఐ బ్యాంక్ బ్యాంకులకు భారీ పెనాల్టీ విధించింది. కేంద్ర బ్యాంకు పిఎన్‌బిపై రూ.1.8 కోట్ల జరిమానా విధించగా, ఐసీఐసీఐ బ్యాంకు మీద 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 చట్టంలోని కొన్ని సెక్షన్లను ఉల్లంఘించినందుకు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

పిఎన్‌బిపై రూ.1.8 కోట్ల జరిమానా
బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలోని సెక్షన్ 19లోని సబ్ సెక్షన్ (2)కు విరుద్ధంగా రుణగ్రహీత కంపెనీల్లో పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో 30 శాతం కంటే ఎక్కువ మొత్తంలో పిఎన్‌బి బ్యాంక్ షేర్లను కలిగి ఉన్నట్లు సెంట్రల్ బ్యాంక్ కనుగొంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు జరిమానా ఎందుకు విధించకూడదో చూపించాలని ఆర్‌బీఐ బ్యాంకు పిఎన్‌బికి నోటీసు జారీ చేసింది. విచారణ సమయంలో చేసిన బ్యాంక్ పేర్కొన్న వివరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలో పేర్కొన్న కొన్ని నిబంధనలను ఉల్లంఘించినట్లు రుజువు కావడంతో ఆర్‌బీఐ పిఎన్‌బి బ్యాంకుపై జరిమానా విధించినట్లు ఒక ప్రకటనలో తేలింది.

ఐసీఐసీఐపై రూ.30 లక్షల జరిమానా
ఐసీఐసీఐ బ్యాంకుకు పొదుపు బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహణ విషయంలో శిక్షారుసుములు విధించడంపై కేంద్ర బ్యాంకు జారీ చేసిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు జరిమానా విధించింది. ఆర్‌బీఐ ఆదేశాలను పాటించకుండా, నిబందనలకు విరుద్దంగా పొదుపు ఖాతాదారుల నుంచి కనీస బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయనందుకు ఛార్జీలు వసూలు చేయడంతో ఐసీఐసీఐకు బ్యాంకుకు నోటీసు జారీ చేసింది. ఆ తర్వాత బ్యాంకు ఇచ్చిన సమాచారం అసంపూర్తిగా ఉండటంతో జరిమానా విధించినట్లు తెలిపింది.

(చదవండి: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్‌..! ఆగిపోనున్న బ్యాంకు కార్యకలాపాలు..!)

>
మరిన్ని వార్తలు