ఆర్థిక సంస్థలు ఆర్బీఐ కీలక ఆదేశాలు

9 Jul, 2021 11:11 IST|Sakshi

లిబార్‌ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాలంటూ సూచన

డిసెంబరు 31లోగా నిర్ణయం తీసుకోవాలంటూ సిఫార్సు 

ముంబై: అంతర్జాతీయంగా, దేశీయంగా కొత్త ఫైనాన్షియల్‌ కాంట్రాక్టుల విషయంలో లండన్‌ ఇంటర్‌బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తున్న రేట్ల (లిబార్‌)కు బదులుగా విస్తృత ప్రాతిపదికన ఆమోదనీయయోగ్యమైన ప్రత్యామ్నాయ రేటు (ఏఏఆర్‌)కు మారాలని బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం స్పష్టం చేసింది. డిసెంబర్‌ 31వ తేదీలోగా ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కొత్త ఫైనాన్షియల్‌ కాంట్రాక్టులకు లిబార్‌ రేట్లు ఇకపై ప్రాతిపదికగా ఉండబోవని ఫైనాన్షియల్‌ కాండక్ట్‌ అథారిటీ (ఎఫ్‌సీఏ) యూకే, ఈ ఏడాది మార్చి 5వ తేదీన చేసిన ప్రకటన నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా ఆదేశాలకు జారీ చేసింది. 

లిబార్‌ రేటును బెంచ్‌మార్క్‌గా తీసుకునే ముంబై ఇంటర్‌ బ్యాంక్‌ ఫార్వార్డ్‌ అవుట్‌రైట్‌ రేటు ఎంఐఎఫ్‌ఓఆర్‌)కు కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఫైనాన్షియల్‌ సంస్థలకు ఆర్‌బీఐ సూచించింది. లిబార్‌ రహిత ఫైనాన్షియల్‌ లావాదేవీల సరళి అంతర్జాతీయంగా, దేశీయంగా ఎలా ఉంటుందన్న అంశంపై తన పర్యవేక్షణ కొనసాగుతుంటుందని కూడా ఆర్‌బీఐ తన తాజా ఆదేశాల్లో పేర్కొంది. రుణాలకు ‘లిబార్‌’  ఇంటర్‌ బ్యాంక్‌ వడ్డీరేటుగా ఉంటుంది.అమెరికా క్యాపిటల్‌ మార్కెట్లకు ‘లిబార్‌’ను స్టాండెర్డ్‌ ఫైనాన్షియల్‌ ఇండెక్స్‌. ఈ పరిస్థితుల్లో 2023 జూన్‌ వరకూ అమెరికా డాలర్‌–లిబార్‌ సెట్టింగ్స్‌ (రేట్ల అనుసంధాన పక్రియ) అమల్లో ఉండనున్నాయి.   
 

>
మరిన్ని వార్తలు