పేటీఎంకు ఆర్‌బీఐ భారీ షాక్‌

26 Nov, 2022 22:02 IST|Sakshi

ప్రముఖ ఫిన్‌టెక్‌ దిగ్గజం పేటీఎంకు భారీ షాక్‌ తగిలింది. పేమెంట్‌ ఆగ్రిగేటర్‌ సర్వీసుల కోసం కొత్తగా లైసెన్స్‌ అప్లయ్‌ చేసుకోవాలని ఆర్‌బీఐ సూచించినట్లు పేటీఎం తన రెగ్యులరేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 

పేటీఎం బ్రాండ్‌తో వన్‌97 కమ్యూనికేషన్స్‌ చెల్లింపు సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే.  అయితే డిసెంబర్ 2020లో పేమెంట్‌ ఆగ్రిగేటర్‌ సర్వీసుల్ని పేటీఎం పేమెంట్స్‌ సర్వీస్‌కు (పీపీఎస్‌ఎల్‌)కు బదిలి చేయాలని ఆర్‌బీఐని కోరింది. అందుకు సంబంధిత డాక్యుమెంట్లను 2021లో సబ్మిట్‌ చేసింది. ఆ డాక్యుమెంట్లపై ఆర్‌బీఐ తాజాగా స్పందించింది. 

పేటీఎం బదిలీ అనుమతి పొందాలంటే వన్‌ 97 కమ్యూనికేషన్‌ గతంలో పెట్టిన పెట్టుబడులు ఫారెన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (ఎఫ్‌డీఐ) చట్టాలకు అనుగుణంగా ఉండాలని తెలిపింది. అప్పటి వరకు అనుమతులు మంజూరయ్యే వరకు కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని పేర్కొంది. దీనిపై పేటీఎం స్పందించింది. ఆర్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల తమ వ్యాపారంపై పెద్దగా ప్రభావం ఉండబోదని పేర్కొంది.

మరిన్ని వార్తలు