అత్యంత చవకైన డ్యూయల్ 5జీ ఫోన్

21 Nov, 2020 13:09 IST|Sakshi

రియల్‌మీ 7 5జీ ఫోన్ని ఇంగ్లాండ్లో జరిగిన వర్చువల్ ఈవెంట్‌లో రియల్‌మీ లాంచ్ చేసింది. ఈ సంవత్సరం ఆగస్టులో చైనాలో లాంచ్ అయిన రియల్‌మీ వీ5నే రీబ్రాండ్ చేసి రియల్‌మీ 7 5జీగా లాంచ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ రియల్‌మీ ఈ ఫోన్‌లో పలు మార్పులు చేసింది. రియల్‌మీ వీ5లో మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌ను తీసుకురాగా, ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌ను తీసుకొచ్చింది. కొత్త స్మార్ట్‌ఫోన్ 120 హెర్ట్జ్ డిస్‌ప్లేతో వస్తుంది. రియల్‌మే 7 5 జీలో క్వాడ్ రియర్ కెమెరాలు ఉన్నాయి మరియు ఫ్రంట్ లో హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్‌ను అందిస్తుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ అయిన రియల్ మీ 7, రియల్ మీ 7 ప్రో, రియల్ మీ 7ఐలకు అప్ గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అత్యంత చవకైన డ్యూయల్ 5జీ కనెక్టివిటీ ఉన్న ఫోన్ ఇదే.

రియల్ మీ 7 5జీ స్పెసిఫికేషన్లు 

డిస్ ప్లే 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ 
ప్రాసెసర్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ
ర్యామ్ 6 జీబీ
స్టోరేజ్ 128 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్‌డీ కార్డు(256 జీబీ)
ప్రధాన కెమెరా  48 ఎంపీ, 8 ఎంపీ( అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, మాక్రో షూటర్, మోనోక్రోమ్ )
ఫ్రంట్ కెమెరా 16 ఎంపీ 
బ్లూటూత్ బ్లూటూత్ 5.1
సెన్సార్ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
బ్యాటరీ  5000 ఎంఏహెచ్, 30W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ
ఆపరేటింగ్ సిస్టమ్  ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీ యు ఐ
కనెక్టివిటీ 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై
కలర్ బాల్టిక్ బ్లూ

ఈ స్మార్ట్ ఫోన్ ధరను 279 యూరోలుగా(సుమారు రూ.27,400) నిర్ణయించారు. ఇందులో కేవలం 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. బాల్టిక్ బ్లూ రంగులో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ ఇంగ్లండ్‌లో నవంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రారంభ ఆఫర్ కింద దీన్ని 229 యూరోలకే(సుమారు రూ.22,500) విక్రయించనున్నారు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియాల్సి ఉంది. 
 
 

మరిన్ని వార్తలు