రియల్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ : సరసమైన ధరలో

24 Apr, 2021 15:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  స్మార్ట్‌ఫోన్స్‌ బ్రాండ్‌ రియల్‌మీ తాజాగా చవక 5జీ మోడల్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. రియల్‌మీ 8 5జీ పేరుతో రెండు వేరియంట్లలో దీనిని అందుబాటులోకి తెచ్చింది. డ్యూయల్‌ 5జీ, డ్యూయల్‌ స్టాండ్‌బైతో భారత్‌లో తొలిసారిగా మీడియాటెక్‌ డైమెన్సిటీ 700 5జీ ప్రాసెసర్‌ను పొందుపరిచారు. 8.5 మిల్లీమీటర్ల మందం, 6.5 అంగుళాల అల్ట్రా స్మూత్‌ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 28 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, డైనమిక్‌ ర్యామ్‌ ఎక్స్‌పాన్షన్‌ టెక్నాలజీ  ప్రధాన ఆకర్షణ. ఉంది. 4జీబీ, 8 జీబీ ర్యామ్‌  రెండు వేరియంట్లలో ఇది లభ్యం. భారత్‌లో ఇదే చవకైన 5జీ ఫోన్‌ అని రియల్‌మీ డిస్ట్రిబ్యూషన్‌లో ఉన్న మొబిఫ్లో ఎండీ  మల్లికార్జున్‌ తెలిపారు.

ధరలు
4జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ.14,999 
8 జీబీ ర్యామ్‌ ధర రూ.16,999
ఏప్రిల్‌ 28 నుంచి  కొనుగోలు చేయవచ్చు

రియల్‌మీ 8 5జీ ఫీచర్లు
6.50 అంగుళాల అల్ట్రా స్మూత్‌  స్క్రీన్‌
1080x2400 పిక్సెళ్ల రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 11
మీడియాటెక్ డైమెన్సిటీ 700ప్రాసెసర్
16  ఎంపీ ఆర్టిఫీషియల్‌ ఇంటెల్లిజెన్స్‌ బ్యూటీ సెల్ఫీ కెమెరా
48+ 2+2-మెగాపిక్సెల్
4 జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌
5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు