రియల్‌మీ 8 ప్రో : సూపర్‌ కెమెరా ఫీచర్లు

26 Mar, 2021 13:30 IST|Sakshi

108 ఎంపీ కెమెరాతో రియల్‌మీ8 ప్రో 

రియర్‌ క్వాడ్‌కెమెరా

రెండు వేరియంట్లలో లభ్యం

సాక్షి, ముంబై:  స్మార్ట్‌ఫోన్స్‌ తయారీ కంపెనీ రియల్‌మీ తొలిసారిగా 108 మెగాపిక్సెల్‌ అల్ట్రా క్వాడ్‌ కెమెరాతో ఒక స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరించింది. రియల్‌మీ8 ప్రో పేరుతో దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.  క్వాడ్‌ కెమెరాతోపాటు ప్రపంచంలో తొలిసారిగా స్టారీ టైమ్‌ ల్యాప్స్‌ వీడియో, టిల్ట్‌ షిఫ్ట్‌ టైమ్‌ ల్యాప్స్‌ వీడియో ఫీచర్లను జోడించినట్టు కంపెనీ తెలిపింది.

రియల్‌మీ8 ప్రో ఫీచర్లు
6.40 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ ఫుల్‌ స్క్రీన్ డిస్‌ప్లే
1080x2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720  జీ ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌ 11
16 ఎంపీ సెల్పీ కెమెరా 
108+ 8 + 2+ 2 ఎంపీ క్వాడ్‌  రియల్‌ కెమెరా
6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
4500 ఎంఏహెచ్ బ్యాటరీ 

ధరలు
6 జీబీ వేరియంట్‌ ధర రూ.17,999 
8 జీబీ వేరియంట్‌ రూ.19,999

మరిన్ని వార్తలు