Realme 9 4G With 108MP Camera: తక్కువ ధరలో...108ఎంపీ కెమెరాతో సూపర్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన రియల్‌మీ..!

7 Apr, 2022 17:25 IST|Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లలోకి మరో  స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. కొద్దిరోజుల క్రితమే రియల్‌మీ 9 సిరీస్‌లో భాగంగా  రియల్‌మీ 9 5జీ, రియల్‌మీ 9 5జీ స్పీడ్ ఎడిషన్, రియల్‌మీ 9ఐ, రియల్‌మీ 9 ప్రో 5జీ, రియల్‌మీ 9 ప్రో ప్లస్ 5జీ మోడల్స్ రిలీజైన సంగతి తెలిసిందే. తాజాగా రియల్‌మీ 9 సిరీస్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మీ 9 4జీ ను తీసుకువచ్చింది.

ధర ఎంతంటే..?
హైఎండ్‌ స్పెసిఫికేషన్లతో స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరకు అందించేందుకుగాను రియల్‌మీ 9 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చింది రియల్‌మీ. ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో రానుంది. రియల్‌మీ 9 4జీ (6జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్) ధర రూ.17,999 కాగా, రియల్‌మీ 9 4జీ (8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్) ధర రూ.18,999 గా ఉంది. సన్ బరస్ట్ గోల్డ్, స్టార్‌గేజ్ వైట్, మెటియార్ బ్లాక్ కలర్స్‌ వేరియంట్స్‌లో రానుంది.  రియల్‌ మీ 9 4జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ సందర్భంగా...హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. కొనుగోలుదారులకు రూ.2,000 డిస్కౌంట్ లభించనుంది.ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు ఏప్రిల్ 12న అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ వెబ్‌సైట్, రీటైల్ స్టోర్ల కొనుగోలు చేయవచ్చును.

రియల్‌మీ 9 4జీ స్పెసిఫికేషన్స్

  • 6.4 అంగుళాల 90Hz అమొలెడ్ డిస్‌ప్లే
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌
  • 8జీబీ ర్యామ్‌+128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 108 ఎంపీ Samsung ISOCELL HM6 సెన్సార్ + 8ఎంపీ సూపర్ వైడ్ కెమెరా + 2 ఎంపీ ట్రిపుల్ రియర్‌ కెమెరా
  • 16ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • 5,000ఎంఏహెచ్ బ్యాటరీ
  • 33వాట్ ఛార్జింగ్‌ సపోర్ట్

చదవండి: వన్‌ప్లస్‌ 9, వన్‌ప్లస్‌ 9 ప్రో స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు...!

మరిన్ని వార్తలు