Realme C21y : రియ‌ల్ మీ సిరీస్‌ ఫీచ‌ర్స్ ఇలా..

3 Jun, 2021 13:35 IST|Sakshi

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ తన కొత్త ఫోన్ రియ‌ల్ మీ సీ21 వైని మనదేశంలో లాంచ్ చేయనుంది. థాయిలాండ్ కు చెందిన ప్ర‌భుత్వ రంగానికి చెందిన టెలికాం సంస్థ వెబ్ సైట్ లో  రియల్‌మి సి 21వై త్వ‌ర‌లో విడుద‌ల కానున్నట్లు ఇదే విష‌యాన్ని ధృవీక‌రించింది. రియల్ మీ సి25ఎస్ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ చేయబోతున్నట్లు కొన్ని నివేదికలు సూచించిన కొన్ని రోజుల‌కే  రియ‌ల్ మీ సి 21వై గురించి వెలుగులోకి రావ‌డం చ‌ర్చాంశ‌నీయంగా మారింది. ఇక, త్వ‌ర‌లో భార‌త్ లో విడుద‌లయ్య రియ‌ల్ మీ సి 21వై ఫీచ‌ర్స్ ఎలా ఉండ‌బోతున్నాయో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం. 

రియ‌ల్ మీ సి21వై ఫీచ‌ర్స్ 

• 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ

• 18W ఫాస్ట్ ఛార్జింగ్‌

• యుఐ 2.0 స్కిన్‌తో ఆండ్రాయిడ్ 11 ను రన్

• 4 జి ఎల్‌టిఇ కనెక్టివిటీ

• స్కైర్ మోడ‌ల్ తో 3కెమోరాలు 

• ఎల్ ఈడీ ఫ్లాష్ కోసం ఫోర్ క‌టౌట్స్‌

•  ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ లు ఉన్నాయి. అయితే ప్ర‌స్తుతం థాయిలాండ్ టెలికాం సంస్థ స్మార్ట్ ఫోన్ అనుమ‌తుల జాబితాలో  రియల్ మీ సి21వై ఉండ‌డంతో ప్ర‌స్తుతం ఈ ఫోన్ సంబంధించిన అతి కొద్ది ఫీచ‌ర్లు మాత్ర‌మే వెలుగులోకి రాగా .. రియ‌ల్ మీ సి 25ఎస్ పేరుతో రియల్ మీ త‌న స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొద్దిరోజుల క్రితం మ‌లేషియాలో అధికారికంగా విడుద‌లైన ఈఫోన్ భార‌త్ లో విడుద‌ల చేసేందుకు రియ‌ల్ మీ ప్ర‌తినిధులు సిద్ధ‌మ‌య్యాయ‌రు.  

 చ‌ద‌వండి : కోవిడ్ బాధిత ఉద్యోగి కుటుంబాలకు రిలయన్స్​ భారీ సాయం
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు