Realme C30s: లోబడ్జెట్‌ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే...

16 Sep, 2022 10:19 IST|Sakshi

న్యూఢిల్లీ: రియల్‌మీ కంపెనీ సీ సిరీస్‌ నుంచి సీ30ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. తక్కువ ధరలోనే ఫింగర్‌ప్రింట్‌ అన్‌లాక్‌ ఫీచర్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. యూనిసాక్‌ ఎస్‌సీ9863ఏ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌ డిస్‌ప్లే 6.5 అంగుళాల పరిమాణంలో ఉంటుంది. వెనుక భాగంలో 8 మెగాపిక్సల్‌ ఏఐ కెమెరా, సెల్ఫీల కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సల్‌ కెమెరా ఏర్పాటు చేశారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. 

రియల్‌మీ సీ30ఎస్‌  స్పెసిఫికేషన్స్‌
6.5 ఇంచుల HD+ LCD డిస్‌ప్లేను 
60Hz రిఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ Unisoc SC9863A ప్రాసెసర్‌ 
ఆండ్రాయిడ్‌ 12 బేస్ట్ రియల్‌మీ యూఐ గో ఎడిషన్‌తో 
64 జీబీదాకా విస్తరించుకును అవకాశం
8 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ  సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ

ధరలు,లభ్యత
2 జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.7,499, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8,999గా ఉంది. స్ట్రిప్ బ్లాక్, స్ట్రిప్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో ఇది లభ్యం. రియల్‌మీ సీ30ఎస్ మొబైల్‌  ఫ్లిప్‌కార్ట్ బిలియన్ డేస్ సందర్భంగా   సెప్టెంబరు 23నుంచి సేల్‌కు రానుంది.

మరిన్ని వార్తలు