ఐఫోన్‌ ఫీచర్లతో తొలి ఆండ్రాయిడ్‌ ఫోన్‌..!

27 Jul, 2021 16:06 IST|Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీదారు రియల్‌మీ మరో సంచలనానికి తెర తీయనుంది. ఆపిల్‌ ఐఫోన్‌-12  ఫీచర్లు కల్గిన ఫోన్లను రియల్‌ మీ ఫ్లాష్‌ పేరిట టీజ్‌ చేసింది. మాగ్నెటిక్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే తొలి ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌గా రియల్‌మీ ఫ్లాష్‌ అవతరిస్తుందని కంపెనీ ఇండియా సీఈఓ మాధవ్‌ శ్వేత్‌ పేర్కొన్నారు.  రియల్‌మీ నుంచి వచ్చే కొత్త ఫోన్‌ను కంపెనీ సీఈఓ మాధవ్‌ శ్వేత్‌ ట్విటర్‌లో టీజ్‌ చేశాడు.  బీబీకే బ్రాండ్‌ ఉత్పత్తుల్లో రియల్‌ మీ ఫ్లాష్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లలో పవర్‌ఫుల్‌ ఫోన్‌గా నిలుస్తోందని పుకార్లు వస్తున్నాయి.

త్వరలో రిలీజ్‌ కాబోయే రియల్‌మీ ఫ్లాష్‌ స్నాప్‌డ్రాగన్‌ 888ను అమర్చిన్నట్లు తెలుస్తోంది. రియల్‌మీ ఫ్లాష్‌ మొబైల్‌ను సపోర్ట్‌ చేసేందుకు వీలుగా రియల్‌ మాగ్‌డార్ట్‌ వైర్‌లెస్‌ ఛార్జర్‌ను కూగా లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆపిల్‌ ఐఫోన్లకు మాగ్‌సేఫ్‌ పనిచేసినట్లుగానే ఈ  రియల్‌ మీ మాగ్‌డార్ట్‌ పనిచేయనుంది. మాగ్‌డార్ట్‌ ఛార్జర్‌ కనీసం 15W ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా రియల్‌ మీ ఫ్లాష్‌ మార్కెట్‌ రిలీజ్‌ డేట్‌ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. 

రియల్‌ మీ ఫ్లాష్‌ ఫీచర్లు

  • క్వాలకం స్నాప్‌డ్రాగన్‌ 888 
  • 12 జీబీ ర్యామ్‌ ఇంటర్నల్‌ స్టోరేజీ 256 జీబీ
  • కర్వ్‌డ్‌ స్క్రీన్‌
  • కార్నర్‌ పంచ్‌ హోల్‌ కెమెరా
  • ట్రిపుల్‌ రియర్‌ కెమెరా

>
మరిన్ని వార్తలు