పవర్ ఫుల్ ప్రాసెసర్ తో విడుదలైన రియల్‌మీ జీటీ 5జీ

15 Jun, 2021 20:48 IST|Sakshi

చైనా మొబైల్ తయారీ దిగ్గజం రియల్‌మీ తన జీటీ 5జీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ గా ఈ రోజు అట్టహాసంగా లాంచ్ చేసింది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్‌మీ టెక్‌లైఫ్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ను కూడా లాంచ్ చేసింది. అలాగే రియల్‌మీ బుక్ ల్యాప్‌టాప్‌, రియల్‌మీ ప్యాడ్ టాబ్లెట్ కూడా టీస్ చేసింది. రియల్‌మీ జీటీ 5జీని చైనాలో మార్చిలో విడుదల చేసింది. దీనిలో పవర్ ఫుల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ గల ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది.

భారతదేశంలో రియల్‌మీ జీటీ 5జీ లాంచ్ వివరాలు ఇంకా ప్రకటించలేదు. రియల్‌మీ జీటీ 5జీ 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్‌ను చైనా సీఎన్‌వై 2,799(సుమారు రూ.32,100) ధరకు విడుదల చేసింది. అలాగే 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర సీఎన్‌వై 3,299 (రూ. 37,800). 

రియల్‌మీ జీటీ 5జీ స్పెసిఫికేషన్లు:

  • 6.43-అంగుళాల ఫుల్-హెచ్ డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ 
  • ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ర్యామ్
  • 12 జీబీ ర్యామ్, 256 జీబీ యుఎఫ్‌ఎస్ 3.1 స్టోరేజ్
  • 64 ఎంపీ సోనీ ఐఎంఎక్స్682 ప్రైమరీ కెమెరా
  • 8 ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్‌ కెమెరా 
  • 2 ఎంపీ మాక్రో షూటర్ కెమెరా 
  • 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా(ఎఫ్ / 2.5 లెన్స్‌)
  • 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ 
  • 65 వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ

చదవండి: బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా విడుదలకు లైన్ క్లియర్

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు