ప్రపంచంలోనే ఫాస్టెస్ట్‌ ఛార్జింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన రియల్‌మీ..! ధర ఎంతంటే..?

22 Mar, 2022 20:39 IST|Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్‌ ఛార్జింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌మీ జీటీ నియో 3(Realme GT Neo 3) స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో రిలీజ్‌ చేసింది.  స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యంత ఫాస్టెస్ట్‌ ఛార్జింగ్‌ స్మార్ట్‌ఫోన్‌గా రియల్‌మీ జీటీ నియో 3 నిలుస్తోందని కంపెనీ ప్రకటించింది. 150W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తోంది.  ఇది కేవలం 5 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీను ఛార్జ్‌ చేయనుంది.

గత ఏడాది చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ 120 వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో Xiaomi 11i హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్‌ చేసింది.  ఈ స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా రియల్‌మీ జీటీ నియో 3ను తీసుకొచ్చింది. రియల్‌మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్‌ తొలుత చైనా మార్కెట్లలో అందుబాటులో ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా రియల్‌మీ జీటీ నియో 3 త్వరలోనే అందుబాటులోకి వస్తోందని రియల్‌మీ పేర్కొంది. థర్మల్‌ మేనెజ్‌మెంట్‌ కోసం డైమండ్‌ ఐస్‌ కోర్‌ కూలింగ్‌ ప్లస్‌ ఫీచర్‌ Realme GT Neo 3 సొంతం. 

ధర ఎంతంటే..!
Realme GT Neo 3 రెండు విభిన్న బ్యాటరీ సామర్థ్యాలతో రెండు వేరియంట్లలో వస్తుంది . 150W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,500mAh బ్యాటరీ స్టోరేజ్‌, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ స్టోరేజ్‌. ఈ స్మార్ట్‌ఫోన్స్‌లో గరిష్టంగా 12జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రానుంది.  

ఇక రియల్‌మీ జీటీ నియో3  6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర  CNY 1,999 యువాన్లు (దాదాపు రూ. 24,000) గా ఉంది. 8GB ర్యామ్‌ + 256GB ఇంటర్నట్‌ స్టోరేజ్‌వేరియంట్‌ ధర CNY 2,299 యువాన్లు (దాదాపు రూ. 27,500) ​కాగా, 12GB ర్యామ్‌ + 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర CNY 2,599 (సుమారు రూ. 31,200) యువాన్లుగా ఉంది. 

Realme GT Neo 3 150W వేరియంట్(8GB ర్యామ్‌ + 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌) ధర CNY 2,599 యువాన్లు ఉండగా, 12GB ర్యామ్‌ + 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ మోడల్ ధర CNY 2,799 (దాదాపు రూ. 33,600) యువాన్లుగా ఉంది.  సైక్లోనస్ బ్లాక్, సిల్వర్‌స్టోన్,  లే మాన్స్  కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

రియల్‌మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌

  • 6.7-అంగుళాల 2K డిస్‌ప్లే HDR10+, DC డిమ్మింగ్ సపోర్ట్‌
  • ఆండ్రాయిడ్‌ 11
  • మీడియాటెక్‌ డిమెన్సిటీ 8100 5జీ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌
  • 12జీబీ ర్యామ్‌+ 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 50 ఎంపీ ట్రిపుల్‌రియర్‌ కెమెరా
  • 5జీ సపోర్ట్‌
  • 150 వాట్‌ ఛార్జింగ్‌
  • 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • డాల్బీ ఆట్మోస్‌ స్పీకర్స్‌

చదవండి: వచ్చేశాయి..షావోమీ నయా ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్స్‌...ఐఫోన్లలో వాడే టెక్నాలజీతో

మరిన్ని వార్తలు