రియల్‌ మీ నుంచి జీటీ నియో–2

18 Oct, 2021 06:06 IST|Sakshi

న్యూఢిల్లీ: రియల్‌మీ తన జీటీ సిరీస్‌లో కొత్తగా జీటీ నియో 2 5జీ మొబైల్‌ను విడుదల చేసింది. ఇందులో క్వాల్‌కామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 870 5జీ ప్రాసెసర్, 120 హెర్జ్‌ రీఫ్రెష్‌ రేట్‌తో కూడిన ఈ4 (మరింత ప్రకాశవంతంగా, తక్కువ ఇంధనాన్ని వినియోగించుకునే) అమోలెడ్‌ డిస్‌ప్లే, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 65 వాట్‌ సూపర్‌డార్ట్‌ చార్జర్, వెనుక భాగంలో 64 మెగాపిక్సల్‌ ఏఐ ట్రిపుల్‌ కెమెరా, 7జీబీ డైనమిక్‌ ర్యామ్‌ ఎక్స్‌పాన్షన్‌ సదుపాయం ఇలా ఎన్నో ఫీచర్లున్నాయి. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.31,999 కాగా, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.35,999. ఫ్లిప్‌కార్ట్‌ పోర్టల్, రియల్‌మీ పోర్టల్‌పై కొనుగోలు చేసేవారికి పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. అదే విధంగా రియల్‌మీ 4కే స్మార్ట్‌ గూగుల్‌ టీవీ స్టిక్, రియల్‌మీ బ్రిక్‌ బ్లూటూత్‌ స్పీకర్, గేమింగ్‌ పరికరాలను సైతం విడుదల చేసింది.

మరిన్ని వార్తలు