రియల్‌మీ 10 సిరీస్‌ లాంచ్‌..ఫీచర్లు ఎలా ఉన్నాయో మీరే చూడండి!

9 Nov, 2022 12:46 IST|Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి తాజాగా  రియల్‌మి 10 సిరీస్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. త్వరలో చైనా ఆ తర్వాత మిగిలిన దేశాల స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో ఈ ఫోన్‌ను పరిచయం చేయనుంది. 

రియల్‌మీ 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 
రియల్‌మీ నెక్స్ట్‌ జనరేషన్‌ మోడల్‌గా చెబుతున్న ఈ ఫోన్లు ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌తో పనిచేస్తుండగా.. వీటిలో 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ, మీడియా టెక్‌ హీలియా జీ 99 చిప్‌ సెట్‌, 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో అమొలెడ్‌ డిస్‌ప్లేను డిజైన్‌ చేసింది. 

రియల్‌ మీ ప్రతినిధులు చెప్పినట్లుగా రియల్‌మీ 10లో గేమ్స్‌ను 9గంటల పాటు నిర్విరామంగా ఆడుకోవచ్చని తెలిపారు. ప్రత్యేకించి ఈ ఫోన్‌ 33 డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో కేవలం 28 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు. 

నవంబర్‌ 17న 
రియల్‌ మీ నవంబర్‌ 17న రియల్‌ మీ 10 చైనా వెర్షన్‌ను అక్కడ పెద్ద ఎత్తున లాంచ్‌ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ ఈవెంట్‌లో రియల్‌మీ 10 ప్రో, రియల్‌మీ ప్రో ప్లస్‌ను సైతం యూజర్లకు పరిచయం చేస్తుంది. ఇక ఈ లేటెస్ట్‌ రియల్‌ మీ సిరీస్‌ 10 ధరలు ఎంత ఉంటాయనే అంశంపై స్పష్టత లేనప్పటికీ.. గతేడాది రియల్‌మీ విడుదల చేసిన రియల్‌మీ 9 సిరీస్‌ తరహాలో బడ్జెట్‌లో ధరలు ఉంటాయని మార్కెట్‌ నిపుణలు అంచనా వేస్తున్నారు. 

మరిన్ని వార్తలు