Realme : రూ.7వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఎప్పుడో తెలుసా ?

27 Jun, 2021 11:12 IST|Sakshi

గ్లోబుల్‌ 5జీ సమ్మిట్‌ వేదికగా రియల్‌ మీ సీఈఓ ప్రకటన

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ తయారీ సంస్థ రియల్‌ మీ సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది దీపావళి ఫెస్టివల్‌ సందర్భంగా  5జీ స్మార్ట్‌ ఫోన్లను కేవలం రూ.7 వేలకే అందిస్తామని రియల్‌మీ ఇండియా సీఈఓ సీఈవో మాధవ్ సేథ్ ప్రకటించారు. ఒకటో రెండో కాదని ఏకంగా 60 లక్షల ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.  ఇప్పటికే రియల్‌ మీ నార్జో5జీ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.15,999 ఉండగా.. రాబోయే 5జీ స్మార్ట్‌ ఫోన్‌ రూ.7వేలకే అందిస్తామని ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది.  

గ్లోబల్‌ 5జీ సమ్మిట్‌ వేదికగా మాధవ్‌ సేథ్‌ మాట్లాడుతూ " రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ ప్రకారం ఇండియాలో 90 శాతం మంది 5జీ టెక్నాలజీ వైపు మొగ్గుచూపుతున్నారు. అందరికి కంటే ముందుగా తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి తెచ్చి సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్‌ చేస్తాం.  ఇతర 5జీ స్మార్ట్‌ఫోన్‌ సంస్థల కంటే ముందుగా  5జీ స్మార్ట్‌ ఫోన్‌ను తక్కువ ధరలో అందించాలనే లక్ష్యంతో రియల్‌ మీ పని చేస్తుందని" రియల్‌ మీ సీఈఓ సీఈవో మాధవ్ సేథ్ చెప్పారు.  

5 ప్రాడక్ట్‌లు + 1 స్మార్ట్‌ ఫోన్‌
 
దీపావళి ఫెస్టివల్‌ సందర్భంగా సేల్స్‌ కోసం రియల్‌ మీ 1 + 5 + టి స్ట్రాటజీని అప్లయ్‌ చేయనుంది. ఈ స్ట్రాటజీలో భాగంగా ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు, వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్ స్పీకర్లను విడుదల చేసేందుకు రియల్‌ మీ ప్రతినిధులు సిద్ధం చేస్తున్నారు. ఆ ఐదు వస‍్తువుల్నికొంటే ఒక స్మార్ట్‌ ఫోన్‌ను ఆఫర్‌  ప్రకటించనుంది. వీటితో పాటు రియల్‌మీకి చెందిన స్మార్ట్ హోమ్ పరికరాలైన  గేమ్ కన్సోల్స్‌, కంప్యూటర్ మౌస్‌లు, వాక్యూమ్ క్లీనర్స్, స్కేల్స్, టూత్ బ్రష్లు, సాకెట్లు, బల్బులు, కెమెరాలను విడుదల చేయనుండగా.. ఈ ఏడాది నవంబర్‌ లో జరిగే దిపావళి పండుగ సందర్భంగా కష్టమర్లను ఆకట్టుకునేందుకు రియల్‌ మీ  మరిన్ని ఆఫర్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.  

చదవండి: వాట్సాప్‌ నుంచి మనీ ట్రాన్స్‌ఫర్‌ చేయండిలా.!

    

మరిన్ని వార్తలు