Realme: ఎన్నో ఫీచర్లు, ధర ఇంత తక్కువా?!

18 Jun, 2021 13:28 IST|Sakshi

సాక్షి,వెబ్‌ డెస్క్‌: కరోనా కారణంగా స్తబ్ధుగా ఉన్న స్మార్ట్‌ మార్కెట్‌ జోరందుకుంది. దేశంలో అన్‌లాక్‌తో ఆయా సంస్థలు స్మార్ట్‌ ఫోన్‌లను మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే కొత్త కొత్త స్మార్ట్‌ ఫోన్లు సందడి చేస్తుండగా మరికొద్దిరోజుల్లో రియల్‌ మీకి రియల్‌-మి నార్జ్‌30 5జీ, నార్జో30 4జీ స్టార్ట్‌ఫోన్లతోపాటు, బడ్స్‌ క్యూ2, 32 అంగుళాల స్మార్ట్‌ టీవీలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 

ప్రతిసారి రియల్‌ మీ మూడు స్మార్ట్‌ ఫోన్లను విడుదల చేస్తుంది. కానీ తాజాగా రియల్‌ మీ నార్జో30 సిరీస్ లోని నార్జో30 ప్రో, నార్జో30 ఎ అనే రెండు మోడళ్లు స్మార్ట్‌ ప్రియుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని రియల్‌-మి ఇండియా, యూరప్‌ సీఈఓ మాధవ్‌ శేథ్‌ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ నార్జో 30ప్రో, నార్జో30 ఏ స్మార్ట్‌ ఫోన్లు మలేషియాలో రేసింగ్‌ బ్లూ, రేసింగ్‌ బ్లాక్‌ కలర్స్‌ లో విడుదలయ్యాయి. 

రియల్‌ మీ నార్జో30 5జిస్పెసిఫికేషన్లు
స్పెసిఫికేషన్ల వారీగా రియల్‌మే నార్జో30 5జి, నార్జో30 4జి చిప్‌సెట్, ఇతర చిన్న స్పెసిఫికేషన్లు మినహాయిస్తే మిగిలిన ఫీచర్స్‌ అన్నీ ఒకేలా ఉంటాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. రియల్‌మీ నార్జో30 5జి ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేయనుంది. 

ధర: 799 మలేషియన్ రింగెట్లుగా(సుమారు రూ.14,100) నిర్ణయించారు. భారత్‌ లో సైతం కాస్ట్‌ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చనే అంచనా. 

నార్జో30 4జి స్పెసిఫికేషన్లు
నార్జో30 4జి లో మీడియాటెక్ హెలియో జి 95 చిప్‌సెట్ ఉంటుంది. ఈ రెండు ఫోన్లు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్,  600 నిట్స్ బ్రైట్‌ నెస్‌ ను అందిస్తాయి. 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌ డీ క్వాలీటీ డిస్‌ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్,  ఫోన్‌ పై భాగంలో ఎడమ వైపు 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఫోన్ ఆండ్రాయిడ్ 11కు చెందిన రియల్‌మీ యుఐ 2.0తో పనిచేస్తుంది.  

రియల్‌ మీ నార్జో30 5జి స్పెసిఫికేషన్లు
రియల్‌ మీ నార్జో30 5జిలో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ చిన్న కెమెరాలు, బ్లాక్ అండ్ వైట్ 2 మెగాపిక్సెల్ ఉన్నాయి. మీరు ఫోన్‌లో నైట్‌స్కేప్ మోడ్, ఏఐని ఆపరేట్‌ చేయవచ్చు. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. అదే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్న 4జి వేరియంట్లో 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు భిన్నంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్లో వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ను వినియోగించుకోవచ్చు.    

రియల్‌ మీ బడ్స్ క్యూ2 స్మార్ట్ టీవీ ఫీచర్స్‌  
రియల్‌ మీ అధికారిక వెబ్‌ సైట్‌ లో తెలిపిన వివరాల ప్రకారం... రియల్‌ మీ బడ్స్ క్యూ2.. రియల్‌ మీ బడ్స్2 నియో లాగే ఉండనున్నట్లు తెలుస్తోంది. కాకపోతే బడ్స్ క్యూ 2 యాక్టీవ్‌ సౌండ్స్‌ను కంట్రోల్‌ చేస్తే బడ్స్2 బయట నుంచి వచ్చే సౌండ్‌ ను కంట్రోల్‌ చేయగలదు. 32 అంగుళాల స్మార్ట్ టీవీ పూర్తి హెచ్‌డి రిజల్యూషన్, ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రాబోతోంది. ప్రస్తుతానికి దీని ధర మాత్రం అందుబాటులో లేదు.  

మరిన్ని వార్తలు