టెక్ ప్రపంచంలోనే తొలి ఫోన్,10 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్.. ధర ఎంతంటే!

11 Feb, 2023 21:47 IST|Sakshi

స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో తయారీ సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆ పోటీని తట్టుకొని కొనుగోలు దారుల్ని ఆకట్టుకునేందుకు సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఫీచర్లు, ఫోల్డబుల్‌ ఫోన్‌లు, ఆకట్టుకునే కలర్స్‌ అంటూ రకరకాల ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా స్మార్ట్‌ ఫోన్‌ చరిత్రలోనే తొలిసారి 10 నిమిషాల్లో ఫుల్‌ ఛార్జింగ్‌ పెట్టుకునే సౌకర్యాన్నీ ఓ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ వీలు కల‍్పిచ్చింది. 

సాధారణంగా ఛార్జింగ్‌ పెట్టుకోవాలంటూ కంపెనీని ఒక్కో ఫోన్‌ 2 లేదా 3 గంటలు పెడితేనే ఫుల్‌ ఛార్జింగ్‌ ఎక్కుతుంది. అయితే రియల్‌ ఫోన్‌ను కేవలం 10నిమిషాల్లో ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ‘రియల్‌మీ జీటీ నియో 5జీ’ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌కు 240 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో కేవలం నిమిషాల వ్యవధిలో ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చని ప్రకటించింది. 

10 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ అయ్యే ఫోన్ ఇప్పటివరకు మార్కెట్లోకి రాలేదని.. తొలి 4 నిమిషాల్లో 50శాతం ఛార్జింగ్ పూర్తి చేసుకుందని, 10 నిమిషాల్లోపే 100శాతం పూర్తయిందని రియల్‌మీ తెలిపింది. ఇక ఆఫోన్‌లో 50ఎంపీ, 8ఎంపీ, 2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, వీటితో 4కే, 1080పీ రెజల్యూషన్‌తో వీడియోలు తీసుకోవచ్చు. 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ ఉన్న రియల్‌మీ జీటీ నియో 5 ఫోన్ ధర సుమారు రూ.40వేల వరకు ఉండొచ్చని అంచనా

మరిన్ని వార్తలు