Realme: వచ్చింది మూడేళ్లే..! 84 ఏళ్ల కంపెనీకి గట్టిషాకిచ్చిన రియల్‌మీ..!

3 Feb, 2022 14:29 IST|Sakshi

భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టి జస్ట్‌ మూడేళ్లయ్యింది. బడ్జెట్‌ ఫ్రెండ్లీ, ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్స్‌ తక్కువ ధరకే అందిస్తూ రియల్‌మీ భారత్‌లో మరోసారి సత్తా చాటింది. 

క్యూ4లో నంబర్‌ 2
భారత్‌లో మొబైల్‌ సేల్స్‌కి సంబంధించి మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ కౌంటర్‌ పాయింట్‌ 2021గాను క్యూ4 ఫలితాలను విడుదల చేసింది. ఇందులో 17 శాతం మార్కెట్‌ వాటాతో రియల్‌మీ శాంసంగ్‌ని వెనక్కి నెట్టి ఇండియాలో అత్యధిక మార్కెట్‌ రెండో కంపెనీగా రికార్డు సృష్టించింది. శాంసంగ్‌ నుంచి కొత్త మోడళ్ల రాక తగ్గిపోవడంతో కేవలం 16 శాతం మార్కెట్‌కే పరిమితమై మూడో స్థానంలో నిలిచింది.

షావోమి నెంబర్‌ వన్‌..!
ఇక భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లలో షావోమీ మరోసారి నంబర్‌ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. గత కొన్నేళ్లుగా ఇండియా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో షావోమి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. భారత మార్కెట్‌లో ఒక వెలుగు వెలిగినా శాంసంగ్‌కు  షావోమి భారీగానే గండి కొట్టింది.  2021 క్యూ4లో షావోమీ ఏకంగా 24 శాతం మార్కెట్‌ వాటాతో నంబర్‌ వన్‌గా నిలిచింది.

2021లో టాప్‌ షావోమీ..!
2021గాను ఒవరాల్‌ చూసుకుంటే షావోమీ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది.  షావోమీ 24 శాతం వాటాను ఆక్రమించింది. Mi 11 సిరీస్ అమ్మకాలతో కంపెనీ ఆదాయంలో 258 శాతం పెరుగుదల కన్పించింది. ఇక రెండో స్థానంలో శాంసంగ్‌ నిలిచింది. శాంసంగ్‌ 2021లో  8 శాతం క్షీణతను నమోదుచేసింది.  రియల్‌మీ మూడో స్థానంలో నిలవగా, భారత్‌లో అత్యంత చురుకైన,  వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌ రియల్‌మీ అవతరించింది. Vivo, Oppo నాలుగు, ఐదవ స్థానాలను కార్నర్ చేయగలిగాయి.

చదవండి: గంటకు 19 వేలకుపైగా స్మార్ట్‌ఫోన్స్‌ అమ్మకాలు..! ఇండియన్స్‌ ఫేవరెట్‌ బ్రాండ్‌ అదే..!

మరిన్ని వార్తలు