రియల్‌మీ 5జీ ఫోన్‌పై రూ.6000 తగ్గింపు! ఎప్పుడు? ఎక్కడ ?

11 Sep, 2021 11:43 IST|Sakshi

రియల్‌ మీ సంస్థ తన 5 జీ ఫోన్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. పరిమిత కాలానికే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని రియల్‌మీ చెబుతోంది. ఇంతకీ ఆఫర్‌ పొందడం ఎలా ? ఎ‍ప్పటి వరకు అందుబాటులో ఉంటుంది ?

ఎక్స్‌ 7 మ్యాక్స్‌
బడ్జెట్‌ ధరలో హై ఎండ్‌ ఫీచర్లు అందిస్తూ మార్కెట్‌లో మంచి పట్టు సాధించిన రియల్‌మీ సంస్థ ఇటీవల ఎక్స్‌ 7 మ్యాక్స్‌ మోడల్‌ని మార్కెట్‌లో విడుదల చేసింది. రియల్‌మీ 5జీ ఫోన్‌గా ఈ మార్కెట్‌లోకి వచ్చిన ఎక్స్‌ 7 మ్యాక్స్‌ ప్రారంభ ధర రూ.29,999లుగా ఉండేది. అయితే ప్రస్తుతం ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్టులో రూ. 26,9999కే లభిస్తోంది, తాజాగా ఈ ఫోన్‌పై మరో ఆఫర్‌ని రియల్‌మీ అందిస్తోంది.

రూ. 6000ల తగ్గింపు
రియల్‌ మీ ఎక్స్‌ 7 మ్యాక్స్‌  హ్యాండ్‌సెట్‌పై రూ.6,000 ప్రత్యేక తగ్గింపును ఆఫర్‌ చేస్తున్నారు. ఈ మొబైల్‌ కొనుగోలు సందర్భంగా క్యాష్‌ ఆన్‌ డెలివరీగా కాకుండా ముందుగానే క్రెడిట్‌ లేదా డెబిట్‌ ఉపయోగించి చెల్లింపులు జరిపితే ప్రత్యేకంగా రూ. 6000 తగ్గింపును అందిస్తోంది. దీంతో పాటు మరో ఎనిమిది రకాల ఆఫర్లను కూడా రియల్‌ మీ అందిస్తోంది.

సెప్టెంబరు 13 వరకే
ఎక్స్‌ 7 మ్యాక్స్‌ ఫోన్‌ కొనుగోలు సందర్భంగా ముందస్తు చెల్లింపులు చేసి రూ.6000 ప్రత్యేక తగ్గింపు పొందే ఆఫర్‌ సెప్టెంబరు 9 నుంచి 13 వరకే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఈ ఆఫర్‌ని పొందవచ్చు.

ఎక్స్‌ 7 మ్యాక్స్‌ కీలక ఫీచర్లు
- దేశంలోనే తొలిసారిగా డైమెన్సిటీ 1200 5జీ ప్రాసెసర్‌ ఉపయోగించారు
- 5జీ ప్లస్‌ 5జీ డ్యుయల్‌ సిమ్‌ స్టాండ్‌బై
- ఆండ్రాయిడ్‌ 11 వెర్షన్‌పై  రియల్‌ మీ యూఐ 2.​ఓతో పని చేస్తుంది
- బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌
- డాల్బీ ఆట్మోస్‌ డ్యూయల్‌ స్టీరియో స్పీకర్స్‌
- స్లెయిన్‌లెస్‌ స్టీల్‌ వేపర్‌ కూలింగ్‌
- 16 మెగాపిక్సెల్‌ వైడ్‌ యాంగిల్‌ సెల్పీ కెమెరా
- సోని 64 మెగాపిక్సెల్‌ ట్రిపుల్‌ కెమెరా
- ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమెల్డ్‌ స్క్రీన్‌, 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌
చదవండి: ఐఫోన్‌ 13 రిలీజ్‌కి రెడీ.. ఎన్ని వెర్షన్లలో తెలుసా ?

మరిన్ని వార్తలు