-

సెప్టెంబర్ 9న మార్కెట్లోకి వస్తున్న రియ‌ల్‌మీ ట్యాబ్‌

6 Sep, 2021 21:15 IST|Sakshi

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్ మీ సెప్టెంబర్ 9న భారత మార్కెట్లోకి రియల్ మీ ప్యాడ్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లిప్ కార్ట్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఒక ప్రత్యేక పేజీని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ పేజీలో రియల్ మీ ప్యాడ్ కీలక స్పెసిఫికేషన్లను, డిస్ ప్లే వివరాలను వెల్లడించింది. ఇందులో రెండు కెమెరాలను తీసుకొస్తున్నారు. ఒకటి ముందు, మరొకటి వెనుక భాగంలో ఉండనుంది. ఈ ప్యాడ్ 2,000ఎక్స్1,200 రిజల్యూషన్, 82.5 శాతం స్క్రీన్ టూ బాడీ నిష్పత్తితో 10.4 అంగుళాల ఫుల్ స్క్రీన్ డబ్ల్యుఎక్స్ జిఎ+ డిస్ ప్లే కలిగి ఉండనుంది.(చదవండి: ఈ వారంలో వ‌రుస‌గా ఐదు రోజులు బ్యాంకుల‌కు సెల‌వు)

ఈ రియల్ మీ ప్యాడ్ ఒక మూలలో సింగిల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. దీని ముందు, వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా తీసుకొనిరావొచ్చు. ఈ రెండూ కూడా 1.36 అంగుళాల సెన్సార్లు కలిగి ఉండవచ్చు. దీనిలో ఎఫ్/2.8 అపెర్చర్, 2.8మిమి ఫోకల్ లెంగ్త్, ఇమేజ్ స్టెబిలైజేషన్, 65.3 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ(ఎఫ్ వోవి) ఉండవచ్చు. ఈ రియల్ మీ ప్యాడ్ అల్యూమినియం యూనిబాడీతో వస్తున్నట్లు తెలుస్తుంది. ఇది యుఎస్ బి టైప్-సి పోర్ట్ తో రావచ్చు. ఈ రియల్ మీ ప్యాడ్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 9 మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ప్యాడ్ 3.5 మిమీ హెడ్ ఫోన్ జాక్ తో  వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు