లీకైన రియల్‌ మీ 4కే స్మార్ట్ టీవీ ధరలు

30 May, 2021 20:50 IST|Sakshi

రియల్‌ మీ స్మార్ట్ టీవీ 4కే స్పెసిఫికేషన్లు, ధర మే 31 విడుదలకు ముందే లీక్ అయ్యాయి. కంపెనీ మే 31న రెండు మోడళ్లను 43-అంగుళాల, 50-అంగుళాల స్మార్ట్ టీవీ లాంచ్ చేయనున్నట్లు కొద్దీ రోజుల క్రితం ప్రకటించింది. లీకైన స్పెసిఫికేషన్ల ప్రకారం, రియల్‌ మీ స్మార్ట్ టీవీ 4కే మోడల్స్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ చేత, ఆండ్రాయిడ్ 10 సహాయంతో పనిచేయనున్నాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వి 5, డ్యూయల్-బ్యాండ్ వై-ఫైలను కలిగి ఉంటాయి. రెండు మోడళ్లు 178-డిగ్రీల కోణాల్లో 4కే రిజల్యూషన్‌ను చూడవచ్చు అని సమాచారం.

టిప్‌స్టర్ డెబాయన్ రాయ్ పంచుకున్న వివరాల ప్రకారం.. 43 అంగుళాల మోడల్ ధర రూ.28,000 - 30,000 ఉంటే, 50 అంగుళాల మోడల్ ధర రూ.33,000 నుంచి రూ.35,000 ఉండే అవకాశం ఉంది. దీనిలో క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ చేత, ఆండ్రాయిడ్ టీవీ 10 సహాయంతో నడవనుంది. ఇందులో డాల్బీ విజన్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉంది. డాల్బీ అట్మోస్, డీటీఎస్ హెచ్‌డీ సపోర్ట్ తో 24వాట్ క్వాడ్ స్టీరియో స్పీకర్ సిస్టమ్ ద్వారా ఆడియోను వినవచ్చు. కనెక్టివిటీ కోసం, ఈ టీవీలో మూడు హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు, రెండు యుఎస్‌బి పోర్ట్‌లు, ఎవి అవుట్ పోర్ట్, ఈథర్నెట్ పోర్ట్, ట్యూనర్ పోర్ట్‌తో రావచ్చు. ఇందులో డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వి 5 కూడా ఉంటాయి. 

చదవండి: 

నెలకు రూ.890 కడితే శామ్‌సంగ్ ఫ్రిజ్‌ మీ సొంతం!

మరిన్ని వార్తలు