దేశంలో తొలిసారిగా విడుదలైన డ్యూయల్‌ సిమ్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌

1 Jun, 2021 20:23 IST|Sakshi

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ.. డ్యూయల్‌ సిమ్‌ 5జీ సపోర్ట్ చేసే ఎక్స్‌7 మ్యాక్స్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. భారత్‌లో తొలిసారిగా డ్యూయల్‌ సిమ్‌ 5జీ సపోర్ట్ చేసే మీడియాటెక్‌ డైమెన్సిటీ 1200 చిప్‌సెట్‌ను ఇందులో తీసుకొచ్చారు. డ్యూయల్‌ సిమ్‌ డ్యూయల్‌ స్టాండ్‌బై కూడా సపోర్ట్‌ చేస్తుంది. జూన్ 4 నుంచి అమ్మకానికి రానుంది. దీని గరిష్ఠ డేటా డౌన్‌లోడ్ వేగం సెకనుకు 4.7 గిగాబిట్ వరకు ఉంటుంది. రియల్‌మీ ఎక్స్ 7 మాక్స్ 5జీలోని మీడియాటెక్ డైమెన్సిటీ 1200 మొబైల్ ప్రియులకు మెరుగైన అనుభూతిని అందిస్తుందని రిరియల్‌మీఇండియా, యూరప్ సీఈఓ మాధవ్ శేత్ తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 8 జీబీ, 128జీబీ ధర రూ.26,999, అలాగే 12 జీబీ, 256జీబీ వేరియంట్‌ ధర రూ.29,999 ఉంది. 

రియల్‌మీ ఎక్స్‌7 మ్యాక్స్‌ 5జీ ఫీచర్స్: 

 • 6.43 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే
 • 120 హెర్ట్జ్‌‌ స్క్రీన్ రిఫ్రెష్ రేట్
 • 360 హెర్ట్జ్‌  టచ్ శాంప్లింగ్ రేట్  
 • ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌ 
 • 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ 
 • 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా(సోనీ ఐఎంఎక్స్682 సెన్సార్‌) 
 • 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్
 • 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ 
 • 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 
 • ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
 • 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 • 50W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్ 
 • 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.1 సపోర్ట్

చదవండి:  భారీగా తగ్గిన యమహా ఎఫ్‌జెడ్ 25 సిరీస్ బైక్ ధరలు

మరిన్ని వార్తలు