రియల్ మీ స్మార్ట్ ఫోన్లపై బంపర్ అఫర్

7 Apr, 2021 14:13 IST|Sakshi

రియల్ మీ మనదేశంలో రియల్ మీ డేస్ పేరుతో ప్రత్యేక సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో భాగంగా రియల్ మీ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందించనున్నారు. ఈ సేల్ ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు ఈ సేల్ జరగనుంది. ఈ ఐదు రోజుల సేల్ లో వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. రియల్ మీ ఎక్స్‌ 7 ప్రో, రియల్ మీ ఎక్స్ 7, రియల్ మీ నార్జో 30 ప్రోతో పాటు మరిన్ని రియల్ మీ స్మార్ట్ ఫోన్లు, ఇతర ఉత్పతులపై అద్భుతమైన డిస్కౌంట్లను రియల్ మీ అందిస్తుంది.

ఫిబ్రవరిలో లాంచ్ అయిన రియల్ మీ ఎక్స్‌ 7 ప్రో ధర రూ.29,999, అయితే మీరు ఈ సేల్ భాగంగా రూ.27,999 కు కొనుగోలు చేయవచ్చు. రియల్ మీ ఆన్‌లైన్ స్టోర్‌లో బుక్ చేసిన ప్రీపెయిడ్ ఆర్డర్‌లకు మాత్రమే రూ.2,000 తగ్గింపు వర్తిస్తుంది. దీని అర్థం మీరు ఎక్స్‌ 7 ప్రోను కొనుగోలు చేసేటప్పుడు ముందస్తు చెల్లింపు చేస్తేనే ఇన్స్టాంట్ డిస్కౌంట్ కింద రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే డిస్కౌంట్ అఫర్ లభించదు. అదేవిధంగా, రియల్ మీ ఎక్స్‌ 7, నార్జో 30 ప్రో మొబైల్స్ పై రూ.1000 ఫ్లాట్ డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ప్రీపెయిడ్ ఆర్డర్‌లపై మాత్రమే వర్తిస్తుంది. మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ పే చేయవచ్చు. వాస్తవానికి రూ.19,999 ధర గల రియల్‌మే ఎక్స్ 7 డిస్కౌంట్ తర్వాత మీకు రూ.18,999కు లభిస్తుంది.  రూ.16,999కు విక్రయించే నార్జో 30 ప్రో మీకు రూ.15,999కు లభిస్తుంది. ఈ సేల్ లో డిస్కౌంట్ అనేది స్మార్ట్‌ఫోన్‌ల పైన మాత్రమే కాకూండా స్మార్ట్ టెలివిజన్లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు, నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు, ఛార్జర్లు, పవర్ బ్యాంకులు, బ్రీఫ్‌కేసులు మొదలైనవి వాటిపై ఉన్నాయి.

చదవండి: రియల్‌మీ నుంచి మరో రెండు అదిరిపోయే 5జీ మొబైల్స్

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు