Xiaomi VS Realme: 'మాధవ్‌ సార్‌ ఇంకా ఎన్నిరోజులు మమ్మల్ని కాపీ కొడతారు'

20 Aug, 2021 14:05 IST|Sakshi

ఇండియన్‌ స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో చైనా కంపెనీలు రియల్‌మీ, షియోమీ  కొత్త యుద్ధానికి తెరలేపాయి. ఇన్నిరోజులు ఆదిపత్యం కోసం సైలెంట్‌ వార్‌ను కొనసాగిస్తుండగా.. ఇప్పుడు ఆ వార్‌ను బహిరంగంగా డిక్లేర్‌ చేశాయి.
ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా ఉన్న ఇండియాలో స్మార్ట్‌ ఫోన్‌ సంస్థలు పోటీ పడుతుంటాయి. మార్కెట్‌లో తమ హవాను కొనసాగించాలనే ఉద్దేశంతో కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారుల్ని ఊరిస్తుంటాయి. కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ ప్రకారం..ఇటీవల ప్రకటించిన క్యూ1 ఫలితాల్లో షియోమీ  28 శాతం మార్కెట్‌ తో ప్రధమ స్థానాన్ని దక్కించుకుంది. 15 శాతంతో  నాలుగో స్థానంలో రియల్‌మీ..షియోమీని వెనక్కి నెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో రియల్‌ మీ ఇండియాలో తొలి ల్యాప్‌ట్యాప్‌ తో పాటు జీటీ సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్లను విడుదల చేసింది. 

తాజాగా రియల్‌మీ ఇండియా 100 మిలియన్‌ ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుందని..ఇందులో భాగంగా ఆగస్ట్‌ 18 నుంచి ఆగస్ట్‌ 28 వరకు #realmefanfestival2021 ను నిర్వహిస్తున్నట్లు అనౌన్స్‌ చేసింది. అంతే ఆ ప్రకటనపై షియోమీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము నిర్వహించే ప్రతి ఈవెంట్‌ను రియల్‌ మీ కాపీకొడుతుందని..ఆ సంస్థ ఇండియా బిజినెస్‌ డైరెక్టర్‌ స్నేహ తైన్‌వాలా ట్వీట్‌ చేశారు.'#copycatfanfestival' హ్యాష్‌ ట్యాగ్‌ తో మాధవ్‌ సార్‌ ఇంకా ఎన్నిరోజులు మమ్మల్ని కాపీ కొడతారు' అంటూ రియల్‌ మీ ఇండియా సీఈఓ మాధవ్‌ సేథ్‌ను ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ దిగ్గజాల వార్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిగ్గా మారింది. 
 

>
మరిన్ని వార్తలు