మార్కెట్లోకి కొత్త కారు.. తెగ కొనేస్తున్న బాలీవుడ్‌, టాలీవుడ్‌ స్టార్స్‌

13 Oct, 2021 17:37 IST|Sakshi

స్టార్‌ హీరోలకు, హీరోయిన్లకు లగ్జరీ కార్లు అంటే మక్కువ ఎక్కువ. మార్కేట్లోకి వచ్చిన కొత్తరకం మోడల్‌ కార్లను ఎప్పుడెప్పుడు తమ ఇంటిముందు పార్క్‌ చేయాలాని ఎదురు చూస్తుంటారు. అందుకే కొత్త రకం కారు వచ్చిందంటే చాలు క్షణం అలస్యం చేయకుండా కొనేస్తారు. దేశంలో భాగ పేరొందిన మోడ‌ల్స్‌లో సూపర్-హాట్ మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ 600 ఒకటి. దీని ధర 2- 4 కోట్ల వరకు ఉంటుంది. ఈ కారు అంటే హీరో, హిరోయిన్లు తెగ ఇష్ట పడుతున్నారు. ఇటీవల ఈ మోడల్ కారును కొనుగోలు చేసిన వారిలో భాగ పేరొందిన స్టార్ హీరో, హీరోయిన్ల గురుంచి తెలుసుకుందాం. ఈ ఖరీదైన కారును నడుపుతు వారు రహదారిపై కనిపించారు.

1.రామ్ చరణ్
దక్షిణాది అతిపెద్ద హీరోలలో రామ్ చరణ్ ఒకరు. అతని ఫ్యాన్ ఫాలోయింగ్ సంఖ్య ఈ కారు కోసం అతను చెల్లించిన మొత్తం కంటే ఎక్కువ. హై సెక్యూరిటీ, అధునాతన టెక్నాలజీతో చరణ్‌ కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఈ కారు ధర రూ.4 కోట్లు ఉంటుందట. అయితే చెర్రి దగ్గర ఇప్పటికే ఫెరారీ, బీఎమ్‌డబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.

2.రణవీర్ సింగ్
మిస్టర్ బాజీరావ్ 'మస్తానీ' గత సంవత్సరం జూలైలో ఈ మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ కారును కొన్నాడు. భారతదేశంలో ప్రారంభించిన ఒక నెల తరువాత దీనిని కొనుగోలు చేశాడు. దీనిని కొనుగోలు చేసిన తర్వాత లంబోర్ఘినిని కూడా కొనుగోలు చేశాడు.(చదవండి: ఆపిల్‌ కొంపముంచిన చిప్స్‌...!)

3. అర్జున్ కపూర్
'అర్జున్ కపూర్' పరిచయం అవసరంలేని బాలీవుడ్ స్టార్. ఎందుకంటే ఇతడు హీరోగా మాత్రమే కాకుండా అసిస్టెంట్ ప్రొడ్యూసర్, అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసారు. అతడు ఇషాక్ జాదే వంటి సినిమా వల్ల బాగా పాపులర్ అయ్యాడు. జర్మనీ లగ్జరీ వాహన తయారీ సంస్థ Mercedes-Maybach GLS 600 కారుని ఈ ఏడాది సెప్టెంబర్ లో కొనుగోలు చేశాడు.(చదవండి: సౌరవ్‌ గంగూలీపై కోకాకోలా కీలక నిర్ణయం..!)

4. కృతి సనన్
‘మిమి’ సక్సెస్‌.. చేతిలో ‘ఆదిపురుష్‌’ వంటి భారీ ప్రాజెక్ట్‌తో ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న హీరోయిన్‌ కృతీ సనన్‌ తనకు తానే ఓ ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చుకున్నారు. సరికొత్త మెర్సిడెస్-మేబాచ్ జీఎల్ఎస్ 600 కారును తనకు తానే గిఫ్ట్‌గా ఇచ్చుకున్నారు కృతీ సనన్‌.
 
5. ఆయుష్మాన్ ఖురానా
2018లో వచ్చిన ‘అంధాదూన్’ అనే సినిమాతో ఆయన నేషనల్ అవార్డు అందుకున్న ఆయుష్మాన్ ఖురానా ఈ ఏడాది జూలై నెలలో ఖరీదైన మెర్సిడెస్-మేబాచ్ జీఎల్ఎస్ 600 కారును కొన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు