ఈ గాడ్జెట్‌ ఇంట్లో ఉంటే.. మన వెంట సెలూన్‌ ఉన్నట్లే

24 Jul, 2022 13:24 IST|Sakshi

ఆకట్టుకునే ప్రతీది అందమే. అందులో కాళ్లూ.. చేతులూ భాగమే. కాలి గోళ్లు, చేతి వేళ్లు.. నాజూగ్గా మారడానికి క్రమం తప్పకుండా బ్యూటీ పార్లర్లకు వెళ్లి.. పెడిక్యూర్, మానిక్యూర్‌ చేయించుకుంటూంటారు. అయితే ఆ శ్రమను తప్పిస్తుంది ఈ రీచార్జబుల్‌ ట్రిమ్మర్‌.

పెద్దలకే కాదు అప్పుడే పుట్టిన పిల్లలక్కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఇది. నొప్పి తెలియకుండా.. శ్రమ లేకుండా ఈజీగా కాలి, చేతి గోళ్లను చక్కగా శుభ్రపరచుకోవచ్చు. అందుకు కావల్సిన మినీ కిట్‌ ఈ డివైజ్‌తో పాటు లభిస్తుంది. ఈ మెషిన్‌కి చార్జింగ్‌ పెట్టుకోవచ్చు. పైగా ఇందులో లిథియం బ్యాటరీ ఉండటంతో.. ప్రయాణాల్లో కూడా దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. 3 స్పీడ్‌ సెట్టింగ్‌ ఉండటంతో.. పిల్లలు, పెద్దలు సురక్షితంగా వాడొచ్చు. గోళ్లు షేప్‌ చేసుకోవడంతో పాటు.. డెడ్‌ స్కిన్‌ తొలగించడం, మృదువుగా మార్చడం.. వంటివన్నీ ఈజీగా చేసుకోవచ్చు.

మెటల్‌ గ్రౌండింగ్‌ హెడ్, ఎడ్జ్‌ ఎక్స్‌ఫోలియేషన్‌ హెడ్, నెయిల్‌ సర్ఫేస్‌ ఫ్రాస్టింగ్‌ పాలిషింగ్‌ హెడ్, పాయింటెడ్‌ ఫ్రాస్టెడ్‌ గ్రౌండింగ్‌ హెడ్, డిస్క్‌ ఫ్రాస్టింగ్‌  పాలిషింగ్‌ హెడ్‌.. ఇలా 5 ప్రత్యేకమైన హెడ్స్‌తో పాటు 3 ప్రత్యేకమైన రోలర్స్‌ లభిస్తాయి. ఈ డివైజ్‌కి ఎడమవైపు చార్జింగ్‌ పాయింట్‌ ఉంటుంది. మరోవైపు.. హెడ్స్‌ అమర్చుకునే స్క్రూ ఉంటుంది. అలాగే డివైజ్‌ ముందువైపు.. రోలర్స్‌ అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. దాంతో మడమల పగుళ్లు, మృతకణాలు వంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. ఈ మెషిన్‌ ఇంట్లో ఉంటే.. మన వెంట సెలూన్‌ ఉన్నట్లే. ధర సుమారు వెయ్యి రూపాయలు. అయితే రివ్యూలను గమనించి కొనుగోలు చేయడం మంచిది. 

మరిన్ని వార్తలు