రికార్డుల ర్యాలీకి బ్రేక్‌.. నష్టాలతో షురూ

19 Nov, 2020 09:33 IST|Sakshi

274 పాయింట్ల క్షీణత‌‌తో 43,906కు సెన్సెక్స్‌

74 పాయింట్లు డౌన్‌- 12,864 వద్ద నిఫ్టీ ట్రేడింగ్‌

బ్యాంకింగ్‌, రియల్టీ, మెటల్ బోర్లా

ఆటో, ఐటీ, ఫార్మా రంగాలు ప్లస్‌లో

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ వీక్‌

ముంబై, సాక్షి: రికార్డుల ర్యాలీకి బ్రేక్‌ వేస్తూ దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 274 పాయింట్ల వెనకడుగుతో 43,906కు చేరగా.. నిఫ్టీ 74 పాయింట్లు క్షీణించి 12,864 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 44,016- 43,821 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ సైతం 12,908- 12,836 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. సెకండ్‌వేవ్‌లో భాగంగా కోవిడ్‌-19 కేసులు పెరిగిపోతుండటంతో బుధవారం మరోసారి యూఎస్‌ మార్కెట్లు 1.2-0.8 శాతం మధ్య డీలాపడ్డాయి. వ్యాక్సిన్లు ఆశలు కలిగిస్తున్నప్పటికీ మరోసారి లాక్‌డవున్‌లు విధించవచ్చన్న భయాలు ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.  

బ్లూచిప్స్‌ తీరిలా
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ, బ్యాంకింగ్‌, ఆటో రంగాలు 1-0.4 శాతం మధ్య ఎగశాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా 0.3 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హీరో మోటో 5 శాతం జంప్‌చేయగా. బీపీసీఎల్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌, మారుతీ, బ్రిటానియా, టాటా స్టీల్‌, బజాజ్ ఫైనాన్స్, ఆర్‌ఐఎల్‌, సిప్లా 2-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, యూపీఎల్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ 3-1 శాతం మధ్య డీలాపడ్డాయి. 

డెరివేటివ్స్‌లో
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో వేదాంతా, అపోలో హాస్పిటల్స్‌, బాటా, ఎల్‌ఐసీ హౌసింగ్‌, అరబిందో, ఎంజీఎల్‌, టీవీఎస్‌ మోటార్‌ 5-1.5 శాతం మధ్య జంప్‌ చేశాయి. కాగా.. మరోపక్క ఆర్‌ఈసీ, బీవోబీ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, అంబుజా, ఇన్ఫ్రాటెల్‌, అపోలో టైర్‌ 2-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.2 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 987 లాభపడగా.. 687 నష్టాలతో కదులుతున్నాయి.

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,072 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,790 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 4,905 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 3,829 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు