Google Photos: మీ స్మార్ట్‌ఫోన్లలో డిలీటైనా ఫోటోలను ఇలా పొందండి...!

9 Sep, 2021 21:20 IST|Sakshi

Recover Deleted Photos and Videos From Google Photos: గడిచిన కాలాన్ని గుర్తుచేసే తీపి జ్ఞాపకాలు ఫోటోస్‌ ..! బ్లాక్‌ అండ్‌ వైట్‌, ఫిల్మ్‌ ఫోటోల నుంచి నేటి స్మార్ట్‌ఫోన్ల వరకు ఫోటోల పరిణామ క్రమం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఫోటో స్టూడియోలకు వెళ్లి ఫోటోగ్రాఫర్‌ మన ఫోటోలను తీయించుకునేవాళ్లము. మారుతున్న కాలంతో పాటు ఫోటో పరిణామ క్రమంలో భారీ మార్పులే వచ్చాయి. నేటి సాంకేతికతతో ఫోటోలను స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలను ఉపయోగించి మన ఫోన్లలో ఆయా సందర్బపు  క్షణాలను బంధిస్తున్నాం.
చదవండి: Gmail: జీమెయిల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌...!

మన స్మార్ట్‌ఫోన్లలో దించిన ఫోటోలను ఎప్పటికప్పుడు గూగుల్‌ ఫోటోస్‌తో సింక్‌ చేయడంతో మన ఫోన్ల నుంచి డిలీట్‌ఐనా ఆయా ఫోటోలు గూగుల్‌ ఫోటోస్‌ సహాకారంతో తిరిగి పొందవచ్చును. స్మార్ట్‌ఫోన్లలో డిలీట్‌ఐనా ఫోటోలను గూగుల్‌ ఫోటోస్‌ ద్వారా పొందే సౌలభ్యం ఉంది. మరి అదే గూగుల్‌ ఫోటోస్‌ నుంచి డిలీట్‌ ఐనా ఫోటోలను లేదా వీడియోలను పొందడం ఏలా అని వాపోతున్నారా...! కంగారు పడే అవసరమే లేదు..! గూగుల్‌ ఫోటోస్‌ నుంచి డిలీట్‌ ఐనా ఫోటోలను మళ్లీ తిరిగి పొందవచ్చును. గూగుల్‌ ఫోటోస్‌ నుంచి డిలీటైనా ఫోటోలు లేదా వీడియోలు 60 రోజుల వ్యవధి దాటితే వాటిని తిరిగి పొందలేము.. 

గూగుల్‌ ఫోటోస్‌ నుంచి డిలీటైనా ఫోటోలను ఇలా పొందండి. 

  • ఆండ్రాయిడ్ ఫోన్, ఆండ్రాయిడ్ టాబ్లెట్, ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో ఫోటో లేదా వీడియోలను తిరిగి పొందడం కోసం మీ ఫోన్‌లో ఉన్న గూగుల్‌ ఫోటోస్‌ యాప్‌ను ఓపెన్‌ చేయండి. 
  • దిగువన ఉన్న లైబ్రరీపై క్లిక్‌ చేయండి. తరువాత ట్రాష్‌ బిన్‌ సింబల్‌పై క్లిక్‌ చేయండి. 
  • మీరు తిరిగి పొందాలనుకున్న ఫోటో లేదా వీడియోలకోసం చూడండి. మీరు ఎంచుకున్న  ఫోటో లేదా వీడియోపై హోల్డ్‌ చేసి ప్రెస్‌ చేయండి. 
  • ఫోటో లేదా వీడియోపై ప్రెస్‌ చేసిన వెంటనే మీకు దిగువన రిస్టోర్‌ అనే అప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసిన వెంటనే తిరిగి ఆయా ఫోటోలను లేదా వీడియోలను తిరిగి గూగుల్‌ ఫోటోస్‌లో పొందవచ్చును. 

ఒక వేళ కంప్యూటర్‌ నుంచి పొందాలనుకుంటే...

  • బ్రౌజర్‌నుపయోగించి మీ జీ మెయిల్‌ ఖాతాలోకి సైన్‌ ఇన్‌ అవ్వండి. నెక్ట్స్‌ ట్యాబ్‌లో photos.google.comను సెర్చ్‌ చేయండి.  
  • మీకు మీ గూగుల్‌ ఫోటోస్‌ ఉన్నఅకౌంట్‌ ప్రత్యక్షమౌతుంది. విండోకు ఎడమ వైపున ఉన్న ట్రాష్ బిన్‌ ఫోల్డర్‌పై క్లిక్ చేయండి.
  • మీరు తిరిగి పొందాలనుకుంటున్న ఫోటో లేదా వీడియోపై  కర్సర్‌ను ఉంచి, ఎగువ కుడి వైపున, ఉన్న రిస్టోర్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయండి . 
  • క్లిక్‌ చేసిన వెంటనే తిరిగి ఆయా ఫోటోలను లేదా వీడియోలను పొందవచ్చును. 

చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్‌..!

మరిన్ని వార్తలు