redRail App: రెడ్‌బస్‌ నుంచి రెడ్‌రైల్‌ యాప్‌

13 Apr, 2022 08:44 IST|Sakshi

ముంబై: ఆన్‌లైన్‌ బస్‌ టికెటింగ్‌ ప్లాట్‌ఫాం రెడ్‌బస్‌ తాజాగా రైలు టికెట్ల బుకింగ్‌ కోసం ’రెడ్‌రైల్‌’ యాప్‌ను ఆవిష్కరించింది. వచ్చే 3–4 సంవత్సరాల్లో కంపెనీ స్థూల టికెటింగ్‌ ఆదాయాల్లో దీని వాటా 10–15 శాతంగా ఉం టుందని ఆశిస్తున్నట్లు రెడ్‌బస్‌ సీఈవో ప్రకాష్‌ సంగం తెలిపారు. రాబోయే రోజుల్లో 5–6 ప్రాంతీయ భాషల్లో కూడా యాప్‌ను అందుబాటులోకి తెచ్చే యోచన ఉన్నట్లు ఆయన వివరించారు.

గత రెండేళ్లుగా ఇటు బస్సు, అటు రైలు టికెట్ల విభాగంలో డిజిటల్‌ మాధ్యమం వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రెడ్‌రైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం సరైన నిర్ణయంగా భావిస్తున్నట్లు ప్రకాష్‌ పేర్కొన్నారు. రోజూ దాదాపు పది లక్షలకు పైగా లావాదేవీలు జరిగే ఆన్‌లైన్‌ ట్రెయిన్‌ టికెట్‌ బుకింగ్‌ మార్కెట్‌లో భారీగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. మేక్‌మైట్రిప్‌ గ్రూప్‌లో రెడ్‌బస్‌ భాగంగా ఉంది.

మరిన్ని వార్తలు