బడ్జెట్ ధరలో.. అదిరే ఫీచర్లతో రెడ్‌​మీ కొత్త ఫోన్!

11 Mar, 2022 18:17 IST|Sakshi

కోవిడ్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్నీ రంగాలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. కానీ స్మార్ట్‌ ఫోన్‌ ఇండస్ట్రీని మహమ్మారిని ఏం చేయలేకపోయింది. దీంతో గతేడాది దేశీయ మార్కెట్‌లో సుమారు 2లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ ఫోన్‌ అమ్మకాలు జరిగాయి.

ఈ నేపథ్యంలో 24శాతం వాటాతో భారత్‌లో టాప్‌ బ్రాండ్‌గా ఉన్న షావోమీ వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస‍్తుంది. తాజాగా షావోమీ రెడ్‌మీ 10 స్మార్ట్‌ ఫోన్‌ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. 

హోలీ సందర్భంగా మర్చి 17న దేశీయ మార్కెట్‌లో రూ.15వేల బడ్జెట్‌ ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ కొత్త ఫోన్‌ అమ్మకాలు ప్రారంభిస్తామని షావోమీ ప్రతినిధులు ప్రకటించారు. 

రెడ్‌మీ 10 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లు 

18డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార‍్జింగ్‌తో 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ

స్నాప్‌ డ్రాగన్‌ 680 ఎస్‌ఓఎస్‌ ప్రాసెసర్‌

18డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌

ఫోన్‌ ముందు పై భాగంలో వాటర్‌ డ్రాప్‌ నాచ్‌  

50ఎంపీ మెయిన్‌ కెమరా సెన్సార్లు

మ్యాక్రో ఫోటో గ్రఫీ కోసం 2ఎంపీ సెన్సార్లు 

చదవండి: ఫ్లిప్‌ కార్ట్‌ బంపరాఫర్‌, అదిరిపోయే ఫీచర్లతో రూ.3వేలకే స్మార్ట్‌ ఫోన్‌!!
 

మరిన్ని వార్తలు