సూపర్‌ ఫీచర్స్‌తో షావోమీ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌..! లాంచ్‌ ఎప్పుడంటే..?

18 Apr, 2022 16:50 IST|Sakshi

భారత మార్కెట్లలోకి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్‌ చేసేందుకు ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ సిద్దమైంది.  రెడ్‌మీ 10 సిరీస్‌లో భాగంగా రెడ్‌మీ 10 ఏ స్మార్ట్‌ఫోన్‌ను షావోమీ లాంచ్‌ చేయనుంది.  ఈ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో ఏప్రిల్‌ 20న లాంచ్‌ కానుంది. రెడ్‌మీ10ఏ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పలు వివరాలను ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా తన వెబ్‌సైట్‌లో టీజ్‌ చేసింది. 

Redmi 10A స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉండగా..ఇదే మోడల్ భారత్‌లో కూడా లాంచ్‌ కానుంది. ఇది Redmi 10 స్మార్ట్‌ఫోన్‌ స్ట్రిప్డ్ వెర్షన్ మాత్రమేనని తెలుస్తోంది. రాబోయే Redmi 10A స్మార్ట్‌ఫోన్‌ Redmi 10 కంటే చౌకగా ఉండే అవకాశం ఉంది.  Redmi 10 ప్రస్తుతం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర రూ.10,999. 6GB RAM + 128GB స్టోరేజ్ టాప్-ఎండ్ మోడల్ ధర రూ.12,999 గా ఉన్నాయి. అయితే భారత మార్కెట్లలో  Redmi 10A ధరను ఇంకా వెల్లడి చేయనప్పటికీ, ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 10,000 లోపు  ఉండవచ్చునని తెలుస్తోంది. Redmi 10A 4GB RAM + 64GB స్టోరేజ్‌ టాప్-ఎండ్ మోడల్‌ ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇక 3GB RAM + 32GB స్టోరేజ్‌ Redmi 10A బేస్ మోడల్ ధర సుమారు రూ. 8,999గా అంచనా వేయబడింది.

Redmi 10A స్పెసిఫికేషన్లు(అంచనా)

  • 6.53-అంగుళాల HD+ LCD డిస్ప్లే విత్‌ 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్ వాటర్‌డ్రాప్ నాచ్‌
  • ఆండ్రాయిడ్‌ 11 సపోర్ట్‌
  • మీడియాటెక్‌ హెలియో జీ25 ప్రాసెసర్‌
  • పవర్‌వీ8320 జీపీయూ గ్రాఫిక్స్‌
  • 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 13 ఎంపీ రియర్‌ కెమెరా
  • 4GB ర్యామ్‌+ 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 10W ఛార్జింగ్ సపోర్ట్‌
  • 5,000mAh బ్యాటరీ
  • మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

చదవండి: మోటోరోలా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్..!

మరిన్ని వార్తలు